ఏపీ రాజకీయాల్లో రెడ్ బుక్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్ష నాయకులపై కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని వైసీపీ ఆరోపణలు చేస్తోంది. ఇటీవల జగన్ కూడా రెడ్ బుక్ విషయాన్ని ప్రస్తావించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోన్న వేళ మంత్రి లోకేష్ స్పష్టత ఇచ్చారు.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్ట ప్రకారం శిక్షించేదే రెడ్ బుక్ అని స్పష్టం చేశారు. తన పాదయాత్రలో రెడ్ బుక్ పట్టుకొని రాష్ట్రమంతా తిరిగానని, ప్రజలకు రెడ్ బుక్ గురించి వివరించానన్నారు. అది నచ్చే కూటమికి ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లన్నీ రెడ్ బుక్ లో ఉన్నాయని, వారికి శిక్ష పడేలా చేస్తామన్నారు.
మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ అగ్రిగోల్ద్ భూముల్ని అక్రమంగా కొనుగోలు చేశారన్న లోకేష్..అలాంటి వారి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేయాలా? అని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో అక్రమాలు జరిగాయని, ఈ విషయంలోనూ చర్యలు ఉంటాయని హెచ్చరించారు లోకేష్.