రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది… శాంతిభద్రతలు క్షీణించాయి… రెడ్ బుక్ అంటూ ఢిల్లీలో హడావిడి చేస్తున్న జగన్ కు మంత్రి పయ్యావుల సవాల్ విసిరారు.
ఢిల్లీలో ధర్నా పేరుతో హడావిడి చేస్తే ఏం వస్తుంది… అసెంబ్లీ నడుస్తోంది, వచ్చి అసెంబ్లీలో మాట్లాడు అని సూచించారు. శాంతిభద్రతలు క్షీణించాయి అని ఆరోపిస్తున్న మాజీ సీఎం జగన్ కు మంచి అవకాశం దొరికింది… అసెంబ్లీలో ఈరోజు సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు కాబట్టి ఆ చర్చలో పాల్గొంటే రాష్ట్ర ప్రజలందరికీ అన్నీ విషయాలు తెలుస్తాయని సూచించారు.
జగన్ ఢిల్లీకి పోయింది ధర్నా చేయడానికి పోయినట్లు లేదని… ఇండియా కూటమిలో చేరటానికి చర్చల కోసం వెళ్లినట్లుంది అని పయ్యావుల ఎద్దేవా చేశారు. ఢిల్లీలోనూ ఆయన్ను ఎవరూ పట్టించుకోలేదని, జాతీయ మీడియాతో మాట్లాడటం తప్పా అక్కడ జరిగేందేమీ లేదని విమర్శించారు.
అసెంబ్లీ లాబీలో చిట్ చాట్ చేసిన మంత్రి పయ్యావుల… జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న చర్యలపై కామెంట్ చేశారు.