గతంలో చర్లపల్లి జైలుకు వెళ్ళిన పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఈసారి తప్పకుండా తీహార్ జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి సత్య కుమార్ యాదవ్. జగన్ జైలుకు వెళ్లకుండా ఏ శక్తి అడ్డుకోలేదని హాట్ కామెంట్స్ చేశారు.
అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు సత్యకుమార్.అనంతపురం బీజేపీ జిల్లా కార్యాలయంలో కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి సత్యకుమార్.. జగన్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.
శాంతి భద్రతలపై గగ్గోలు పెడుతోన్న వైసీపీ నేతలు..ఢిల్లీలో ధర్నా పేరిట నాటకాన్ని రక్తి కట్టించారన్నారు. శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చంద్రబాబు వివరిస్తుంటే జగన్ మాత్రం అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేకపోయారని మండిపడ్డారు.
అసెంబ్లీకి హాజరయ్యేందుకు మొహం చెల్లకే ఢిల్లీలో ధర్నా పేరుతో జగన్ డ్రామాలు మొదలు పెట్టారన్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు జరిగితే..ఆ దాడుల వివరాలు తమకు సమర్పించాలని కోరితే ఎందుకు ఇవ్వలేదని జగన్ ను ప్రశ్నించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని అందుకే జగన్ విధానాలే కారణమని ఆరోపించారు. 9, 76,000కోట్ల అప్పు చేశారని..ఈ అప్పుల సమస్య ఓ వైపు వేధిస్తున్నా..ఇచ్చిన హామీలను కూటమి సర్కార్ నెరవేరుస్తొందన్నారు.