కాంగ్రెస్ సర్కార్ మహిళల కోసం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై బీఆర్ఎస్ నేతలు ఇంకా కారు కూతలు కూస్తూనే ఉన్నారు. ఈ పథకం తీసుకొచ్చిన మొదట్లోనే చిన్న, చిన్న సంఘటనలను చూపుతూ నోటికి పని చెప్పడంతో , ఈ ఫ్రీ జర్నీ స్కీమ్ ను రద్దు చేయమంటారా..? అని కాంగ్రెస్ ప్రశ్నించడంతో మహిళల నుంచి వ్యతిరేకత వస్తుందని సైలెంట్ అయ్యారు. తాజాగా కేటీఆర్ ఈ స్కీమ్ గురించి చేసిన వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయ్యాయి.
ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో ఇద్దరూ మహిళలు ప్రయాణిస్తూ కుట్లు, అల్లికలు వేసిన వీడియోను బీఆర్ఎస్ సోషల్ మీడియా వైరల్ చేసింది. కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన ఈ ఫ్రీ జర్నీ స్కీమ్ మహిళలకు ఇలా కూడా అవసరం వస్తుందంటూ వ్యంగ్యంగా ప్రచారం చేసింది. దీనిపై సీతక్క స్పందిస్తూ..బస్సుల్లో కుట్లు, అల్లికలు చేసుకుంటే తప్పేంటి?సమయం వృథా చేయకుండా పనిచేసుకోవడం తప్పా? అని ప్రశ్నించడంపై కేటీఆర్ స్పందించిన విధానం తీవ్ర విమర్శల పాలౌతుంది.
మనిషికో బస్సు పెట్టుండ్రి ..కుటుంబానికి కుటుంబం పోయి కుట్లు, అల్లికలు అవసరం అయితే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డాన్స్ లు ఏం చేస్తారో చేసుకోండి..మేమెందుకు వద్దంటం కేటీఆర్ అవమాకర రీతిలో మాట్లాడటం తీవ్ర దుమారం రేపుతోంది. మొత్తం తెలంగాణ మహిళలను అవమానించేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఉచిత ప్రయాణ సౌకర్యంపై చిన్న, చిన్న లోపాలు ఉన్నా ఈ పథకం పట్ల మహిళా లోకం సంతృప్తిగా ఉంది. కానీ, కేటీఆర్ మాత్రం ఈ విషయం పట్టించుకోకుండా మంత్రి సీతక్కను టార్గెట్ చేయబోయి , మహిళలు బీఆర్ఎస్ ను అసహించుకునేలా నోరుపారేసుకున్నారని అభిప్రాయం వినిపిస్తోంది.