చంద్రబాబు జడ్ ప్లస్ సెక్యూరిటీ … ఆయన కూడా పెద్దగా సెక్యూరిటీని పట్టించుకోకుండా జనం సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ ఎస్కార్ట్ వాహనాలను వదులుకున్నారు. నారాలోకేష్ సూచనతో ఎస్కార్ట్ వాహనాలన్నింటిన వదులుకుని.. వాటిని వరద సహాయ చర్యలకు పంపాలని నిర్ణయించారు. వెంటనే ఆ ఎస్కార్ట్ వాహనాలన్నీ అదే పనిలోకి వెళ్లిపోయాయి. ఆహారం, మందులు పంపిణీ చేస్తున్న వాహనాలకు ఎస్కార్ట్ గా.. వాటి రవాణా కోసం వినియోగించడం ప్రారంభించారు.
ప్రతి ప్రజాప్రతినిధికి హోదాకు తగ్గట్లుగా ప్రోటోకాల్ ఉంటుంది. మంత్రికి అయిత్ ఎస్కార్ట్ కూడా ఉంటుంది. ఎస్కార్ట్ వాహనాన్ని మరో పనులకు ఉపయోగిస్తే విమర్శలు వస్తాయి. కానీ ఇప్పుడు వరద వచ్చింది.. ప్రజలకు కష్టం వచ్చింది. వారి కోసం ఆ వాహనాల్ని వాడటం సముచితం. అందుకే నారా లోకేష్ ఈ సూచన చేయడం ఆలస్యం వెంటనే… అమలు చేసేశారు కూడా. ఎస్కార్ట్ వాహనాలన్నింటినీ ఆపేసి… సహాయ కార్యక్రమాలకు తరలించారు.
ఒక్క కృష్ణాజిల్లాకు చెందిన వారే కాకుండా అందు బాటులో ఉన్న టీడీపీ ప్రజా ప్రతినిధులంతా పెద్ద ఎత్తున సహాయ కార్యక్రాల్లో పాల్గొంటున్నారు. మైక్రో లెవల్లో ఆపదలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకునేందుకు తాము నడుంలోతు నీళ్లలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజల మన్ననలు అందుకుంటున్నారు.