బెంగాల్ రాజధాని కోల్కతాలో విపక్ష పార్టీల మెగా ర్యాలీపై.. నరేంద్రమోడీ.. వెటకారం చేశారు.అక్కడ చేరిన పార్టీల నేతలంతా.. ” కాపాడండి.. కాపాడండి..” అంటూ అరుస్తున్నారని… తనదైన హావభావాలతో… దాద్రానగర్ హవేలీలో జరిగిన సభలో ప్రసంగిస్తూ చెప్పుకొచ్చారు. ‘మహాకూటమి’ మోదీకి వ్యతిరేకం కాదని, దేశ ప్రజలకు వ్యతిరేకమని ఆయన తీర్మానించారు. విపక్షల నేతలంతా సహజంగా చేతులు కలిపిన వారు కాదని .. ఇప్పటికే ఎవరి వాటాలు వారు మాట్లాడుకున్నారని విమర్శలు గుప్పించారు. బీజేపీని చూసి ప్రాంతీయ పార్టీలన్నీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని, దిక్కుతోచక సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తూ, బచావ్ బచావ్ అంటూ కోల్కతా వేదిక నుంచి కేకలు పెడుతున్నాయని ఎద్దేవా చేశారు.
ఇటీవలి కాలంలో విపక్ష పార్టీలకు చెందిన నేతలను టార్గెట్ చేస్తూ… కేంద్ర దర్యాప్తు సంస్థలు వరుసగా కేసులు నమోదు చేస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల తీరుపై చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. చివరికి సీబీఐలోని ఇద్దరు ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ కారణంగా బయటకు పోవాల్సి వచ్చింది. బీజేపీని వ్యతిరేకించే పార్టీల నేతలపై.. వరసుగా దాడులు చేయడం.. బీజేపీకి దగ్గరగా ఉండే పార్టీ నేతలకు.. మినహాయింపులు లభించడం జరుగుతోంది. చివరికి.. ఉత్తరప్రదేశ్ లో మహాకూటమిగా ఏర్పడిన ఎస్పీ, బీఎస్పీ కూటమిని భయపెట్టేందుకు.. కొద్ది రోజుల కిందటే… అఖిలేష్ యాదవ్ పై ఓ సీబీఐ కేసు కూడా నమోదు చేశారు., ఇక టీడీపీ ఎన్డీఏతో తెగ తెంపులుల చేసుకోగానే.. ఏపీలో వందల మంది ఐటీ అధికారులు సృష్టించిన అలజడి… టీడీపీ నేతల ఇళ్లలో జరిగిన సోదాలు ఇంకా హాట్ టాపిక్ గా ఉన్నాయి.
ఓ వైపు… కోల్ కతాలో విపక్ష పార్టీలన్నీ.. తనకు వ్యతిరేకంగా ఏకమవడానికి .. తన నియంతృత్వమే అని అర్థం చేసుకోలేని స్థితిలో..మోదీ ఉన్నట్లు.. ఆయన మాటలతో అర్థమైపోతుంది. విపక్షాలు… విమర్శలు ఆయనకు బచావ్.. బచావ్ నినాదాలుగా వినిపిస్తున్నాయి అంటేనే… ఆయా పార్టీలపై ఆయన ఎంత కసితో ఉన్నారో.. అర్థం చేసుకోవచ్చన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విపక్ష పార్టీల ఐక్యతా ప్రదర్శనతో.. మోదీకి ప్రత్యామ్నాయం ఉందని.. ప్రజలు గుర్తిస్తారనే అంచనాలు వస్తున్న సమయంలో…ఆయా పార్టీలను మోడీ… నియంత తరహాలో ఎగతాళి చేయడం కలకలం రేపుతోంది.