ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న నలుగురు పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగారు. కుంభమేళాలో.. వారు పారిశుద్ధ్య విధులు నిర్వహించారు. కొన్ని వేల మంది సఫాయీ కార్మికులు.. కుంభమేళాలోవిధులు నిర్వర్తించారు. వారందరికీ గౌరవంగా… మోడీ వీరి కాళ్లు కడిగినట్లు… చెబుతున్నారు. మోడీ కాళ్లు కడుగుతున్న వీడియోను.. అన్ని కోణాల్లో ఆవిష్కరించేలా వీడియో తీయించి.. దాన్ని మీడియాకు విడుదల చేశారు. ఏకంగా ప్రధాని మోడీనే.. ఇలా.. పారిశుద్ధ్య కార్మకుల కాళ్లను కడగడం వారికి ఇచ్చిన గౌరవం అంటూ.. బీజేపీ నేతలు ప్రచారం ప్రారంభించారు.
నరేంద్రమోడీ… ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు ద్వారా పబ్లిసిటీ తెచ్చుకోవడంలో ముందుంటారని.. సహజంగానే విమర్శలు వస్తూ ఉంటాయి. పుల్వామా దాడి ఘటన జరిగినప్పుడు… విషయం తెలిసి కూడా మూడు గంటల పాటు.. ఆయన డిస్కవరీ చానల్ డాక్యుమెంటరీ షూటింగ్ లో ఉన్నారు. వాతావరణం సహకరించకపోవడం వల్ల… ఓ బహిరంగసభకు హాజరు కాలేక.. ఫోన్ ద్వారా.. ప్రసంగించారు. అలా ప్రసంగించడంపై ఆనందం కూడా వ్యక్తం చేశారు. అయితే.. ఓ వైపు.. సైనికులు చనిపోయినా..మోడీ ఇలా చేయడం ఏమిటని.. దేశవ్యాప్తంగా విమర్శలు చెలరేగాయి. ఈ ఇమేజ్ డ్యామేజ్ను కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో ఇప్పుడు.. కొత్తగా.. సఫాయీ కార్మికుల కాళ్లు కడగడం లాంటి.. జిమ్మిక్కులకు పాల్పడుతున్నారని.. విపక్ష పార్టీలు ఇప్పటికే ఆరోపణలు ప్రారంభించాయి.
ఎన్నికల షెడ్యూల్ రాక ముందే.. అధికారిక కార్యక్రమాల పేరుతో… దేశం మొత్తం చుట్టేసి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇలా.. ఉత్తరప్రదేశ్లో పర్యటించి… కిసాన్ సమ్మాన్ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాల నుంచి అందిన రైతుల సమాచారం మేరకు… దాదాపుగా 20 రాష్ట్రాల్లో రైతులకు.. రూ. రెండు వేల చొప్పున జమ చేసే పథకాన్ని ప్రారంభించారు. మిగతా నాలుగు వేలు రెండు వాయిదాల్లో చెల్లిస్తారు.