రైతులు చాలా కష్టాల్లో ఉన్నారు.. వారికి ఆర్థిక సాయం చేయకపోతే నిలబడే పరిస్థితి లేదు. అందుకే.. ఐదు ఎకరాలలోపు ఉన్న వారికి రూ. ఆరు వేలిస్తామని… కేంద్ర ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఆ ఆరు వేలు కూడా మూడు విడతల్లో ఇస్తారు. ఎన్నికలొస్తున్నాయి కాబట్టి.. ఇప్పుడే ఓ రూ. రెండు వేలు పంచేయాలి. కానీ ఇలా పంచాయలన్నా… రూ. ఇరవై వేల కోట్లకుపైగానే కావాలి..! మరి అంత పెద్ద మొత్తం పేద రైతులకు పంచేస్తే.. మోడీ ఎందుకవుతారు..? అందుకే ఎలిమినేషన్స్ ప్రారంభించారు.
ఎలిమినేషన్ కండిషన్స్..!
ఐదు ఎకరాలకు ఒక్క సెంట్ కూడా ఎక్కువ ఉండకూడదు..!
భార్యభర్త ఇద్దరికీ కలిపిన ఐదెకరాలు దాటకూడదు..!
ఇద్దరికీ వేర్వేరుగా మూడెకరాల చొప్పున ఉన్నా అవుట్..!
ఒక వేళ ఐదెకరాలలోపే ఉన్నప్పటి సాగుభూమి కాదా..? అవుతే సాయం రాదు..!
భూ హక్కుల పత్రాలు ఆన్లైన్లో నమోదు కాలేదా..? అయితే రైతువు కావు..!
ఫిబ్రవరి తర్వాత కొత్తగా భూమిపై యాజమన్య హక్కులు వచ్చాయి..? ఐదేళ్ల వరకూ గుర్తించరు..!
కౌలు రైతులా అయితే… పథకం లేనట్లే..!
ఆధార్ లేదా.. అయితే ఎలిమినేషన్..!
ఇలా చెప్పుకుంటూ.. పోతే.. మరికొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.. బయటకు వస్తాయి. ఇన్ని ఎలిమినేటర్లు పెట్టిన తర్వాత ఏ రైతుకు ప్రయోజనం దక్కుతుంది..? . ఓ పది, ఇరవై శాతం మందిరైతులకు చాన్స్ రావొచ్చు. నిజం చెప్పాలంటే.. ఇలాంటి కండిషన్స్ అన్నీ.. ఎక్కువగా దక్షిణాది రైతులకే పెడతారు. ఉత్తరాది రైతులకు ఏదో విధంగా పంపిణీ చేసేస్తారు. అందుకే… ఉత్తరాది ప్రభుత్వాలను కేంద్రం హడవుడి పెడుతోంది. అర్హులైన చిన్న, సన్నకారు రైతుల వివరాలతో సమగ్ర సమాచార నిధి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం సూచించింది. ఇందులో భాగంగా పేరు, కులం, ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా, మొబైల్ నంబరు సేకరించాలట. లబ్ధిదారుల గుర్తింపు, వివరాల అప్లోడ్ ప్రక్రియను వెంటనే అందజేసి కేంద్రం నుంచి లబ్ధిదారుల ఖాతాలకు నిధులు బదిలీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కూడా చెబుతోంది.
అంటే పథకం అమలు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఎంత మందికి ఇవ్వాలనేది మాత్రం… కేంద్రం డిసైడ్ చేస్తుంది. ఏ ఏ రాష్ట్రాల్లో ఎంత మందికి అనేది.. కేంద్రం ఇష్టం. దాని ప్రకారం చూస్తే… ఈ ఎలిమినేషన్స్‌లో… దక్షిణాది రైతులే ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే.. ఇక్కడ రైతులకు ఎంత పంపిణీ చేసినా… బీజేపీకి ఒరిగేదేమీ ఉండదు కదా..! అందుకే ఈ ఎలిమినేషన్స్..!