దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ… కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు, రెస్టారెంట్ల ప్రారంభానికి అనుమతి ఇచ్చారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. విధివిధానాలపై ప్రత్యేకమైన ప్రకటన జారీ చేస్తారు. అలాగే.. జూలై నుంచి స్కూళ్లు,కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ప్రారంభించుకోవడానికి అనుమతి ఇస్తారు. అయితే.. అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటించారు. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులు, సినిమా హాళ్లు, మెట్రో రైళ్లు, జిమ్ లు, ధియేటర్లు , బార్లు , అడిటోరియమ్.. పొలిటికల్ ఈవెంట్స్ సహా.. జనం గుమికూడే ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదు.
ఫేజ్ త్రీలో వీటికి అనుమతి ఇస్తారు. అదెప్పుడన్నది పరిస్థితుల్ని బట్టి నిర్ణయిస్తారు. రాత్రిపూట కర్ఫ్యూ యధావిధిగా కొనసాగుతుందని..కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి ఆటంకాలు ఉండవని ప్రత్యేకంగా పాసులు తీసుకోవాల్సిన అవసరం లేదని..కేంద్రం స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రం ప్రత్యేకంగా ఈ విషయంలో నిబంధనలు అమలు చేయాలనుకుంటే.. ముందుగానే ప్రకటించాల్సి ఉంది. తాజా సడలింపులతో లాక్ డౌన్ సాంకేతికంగానే అమల్లో ఉన్నట్లుగా ..అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రాల మధ్య పర్యటనలు చేయాలంటే.. పాసులు.. క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు.
ఒకటో తేదీ నుంచి రైళ్లు కూడా తిరుగుతున్నందున.. కేంద్రం ప్రకటించిన నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఫలితంగా.. క్వారంటైన్ భయం ఏమీ ఉండదు. అన్ లాక్ ప్రాసెస్‌ను ప్రారంభించిన కేంద్రం… ఖచ్చితంగా… కొన్ని నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేసింది. భౌతిక దూరం పాటించడం… ఫేస్ మాస్క్‌లు ధరించడం… శానిటైజర్లను వినియోగించడం వంటి వాటిని తప్పని సరి చేసింది.