ప్రధాని మోదీ.. సెంగల్ అంటే రాజదండానికి.. కొత్త పార్లమెంట్ ఇచ్చిన ప్రాధాన్యం చూసిన వారికి.. ఏదో తేడాగా ఉందే అనుకోకుండా ఉండలేరు. అంతకు ముందు ఆయన కాశీలో తమిళ సంగమం పేరుతో ఓ కార్యక్రమం చేపట్టి… తమిళ తంబీ వేషంలో ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత తమిళ భాషను పురాతనమైనదిగా పొగిడి…. అందర్నీ ఆశ్చర్యపరిచారు. మోదీ నుంచి వస్తున్న ఈ తమిళ్ వాసలు అందర్నీ ఆశ్చర్య పరుస్తూండగా… అక్కడ పర్యటించిన అమిత్ షా.. తమిళనాడు నుంచి ఓ ప్రధాని రావాలని తన కోరికని చెప్పారు. అన్ని డాట్స్ ను పూర్తి చేస్తే.. అసలు విషయం తెలిసిపోతుంది. అదేమిటంటే… మోదీ తమిళనాడు నుంచిపోటీకి రెడీ అవుతున్నారట.
తమిళనాడు నుంచే ప్రధాని అంటూ చైన్నె, వేలూరు పర్యటన సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొత్త ప్రకటనను తెరపైకి తెచ్చి వెళ్లారు. దీంతో బీజేపీ గేమ్ ప్లాన్ బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దక్షిణాదిలో బీజేపీకి నో ఎంట్రీ బోర్డు కనిపిస్తోంది. దీన్ని బ్రేక్ చేయడానికి మోదీ దక్షిణాదిలో అదీ తమిళనాడులో పోటీ చేయాలనుకుంటున్నారు. ఇందు కోసం ఇరవై శాతం వరకూ ముస్లిం జనాభా ఉండే.. .. రామనాథపురాన్ని ఎంపిక చేశారని అంటున్నారు. అక్కడ డీఎంకే కూటమిలో భాగంగా ముస్లిం పార్టీ అభ్యర్థికి టిక్కెట్ ఇస్తారు. మిగతా ఎనభై శాతం మంది హిందువులు. మోదీ హిందూత్వ వేషాలన్నీ… అందుకేనని… ఆ ఇరవై శాతం మంది.. ఎనభై శాతం మందిని పోలరైజ్ చేసే ప్లానేనని అంటున్నారు.
తమిళనాడులో ఏకంగా 15కు పైగా స్థానాలను గురి పెట్టి బీజేపీ కార్యక్రమాలను విస్తృతం చేస్తోంది. ఇటీవల దర్యాప్తు సంస్థలనూ ఉసిగొల్పారు. ఇప్పటికే డీఎంకేకు చెందిన ఇద్దరు మంత్రుల్ని టార్గెట్ చేశారు. మాజీ ఐపీఎస్ అధికారి.. అన్నామలైకు… చార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన లిస్ట్ ప్రకటించి మరీ దాడులు చేయిస్తున్నారు. దీంతో కథ మారిపోతోంది. మొత్తంగా తమిళనాడుపై బీజేపీ చాలాసీరియస్ గా ఉందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.