కొడాలి నాని గుడివాడను స్థావరంగా మార్చుకున్నారు. పార్టీ ఏదైనా నాలుగు సార్లు గెలిచారు. ఐదో సారి గెలవడానికి ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. గుడివాడ పట్టణంలో ఒక్కో వార్డుకు రెండు, మూడు కోట్ల వరకూ పంపిణీ చేశారు. నిజానికి చేశానని అనుకున్నారు. పంపిణీ చేయమని లీడర్లకు ఇస్తే వారు పంపిణీ ఖాతాలో రాసుకుని ..తమ ఖాతాలో వేసేసుకున్నారు. ఇప్పుడీ వ్యవహారం రచ్చ రచ్చగా మారుతోంది.
డబ్బులు పంపిణీ చేయలేదని…డబ్బులు తిరిగి ఇచ్చేయాలని కొడాలి నాని సోదరుడు వైసీపీ క్యాడర్ పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఓ అనచరుడు వీడియో విడుదల చేశారు. తాము తినలేదని.. తమను అనుమానించి ప్రశ్నిస్తున్నారని అసలు.. డబ్బు దాచుకున్న వారు వేరే ఉన్నారని చెప్పుకొచ్చారు. వారంతా విదేశాల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అందర్నీ కొడాలి నాని కల్యాణమండపానికి పిలిచి కోటింగ్ ఇవ్వాలని అంటున్నారు. ఆ వీడియో వైరల్ అయింది.
ఎన్నికల విషయంలో కొడాలి నాని వ్యవహారం నింపాదిగా ఉంది. ఎలక్షనీరింగ్ కూడా పర్ ఫెక్ట్ గా చేయలేకపోయారు. పోలింగ్ రోజు కనీసం పోలింగ్ బూత్ల పరిశీలనకు కూడా వెళ్లలేదు. పోలింగ్ అయిన తర్వాత అసలు కనిపించడం లేదు. దీంతో డబ్బుల వ్యవహారం మరింత రచ్చగా మారుతోంది.