సినిమా టికెట్ రేట్ల పెంపు కన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ఇప్పుడు పరిశ్రమ ముందు వున్న లక్ష్యం. పెద్ద సినిమాలకు తప్పితే చిన్న, మీడియం సినిమాలకు ప్రేక్షకుడు థియేటర్ కి ఎక్కువగా రావడం లేదు. దీనికి ఓటీటీ ఒక కారణం అయితే, టికెట్ రేట్లు మరో కారణం. సింగిల్ స్క్రీన్స్ తగ్గిపోతున్నాయి. మల్టీ ఫ్లెక్స్ లో టికెట్ తీసుకుందామంటే అక్కడ చూపించే ధర ప్రతి ప్రేక్షకుడికి సరసంగా వుండటం లేదు. దీనికి బదులు ఓటీటీలో వస్తే చూసుకుందాలే అని భావనలోకి జారుకుంటున్నాడు ఆడియన్. ఇది థియేటర్ ఫుట్ ఫాల్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
Read Also : అన్యాయంపై తిరగబడ్డ టెడ్డీబేర్‌ని చూశారా?
ఇలాంటి సందర్భంలో టికెట్ రేట్లు సాధ్యమైనంత వరకూ తగ్గించడమే మేకర్స్ ముందు వున్న ఆప్షన్. ఇప్పుడు అల్లు శిరీష్ బడ్డీ సినిమా నిర్మాతలు కూడా అదే చేశారు. సింగిల్ స్క్రీన్స్ లో రూ.99, మల్టీప్లెక్స్‌లో రూ.125గా నిర్ణయించారు. ఎక్కువ మంది ఆడియన్స్‌కు సినిమా చేరువ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాతలు తెలిపారు. యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ సినిమా ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.