ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ప్రధానమంత్రి జోక్యం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదని.. బ్యాంకులు కూడా మునిగిపోతాయని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆందోళన వ్యక్తం చేశారు. లోక్సభలో జీవో అవర్లో ఆయన ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, అప్పులు విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరారు. ద్రవ్య నియంత్రణ బడ్జెట్ నిర్వహణ.. ఎఫ్ఆర్బీఎం నియంత్రణలు దాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని రఘురామ లోక్సభలో తెలిపారు.
రాష్ర్ర్ట ప్రభుత్వం రాజ్యాంగం లోని 293 నిబంధనను ఉల్లంఘిస్తోందన్నారు. ఇప్పుడు మేలుకోకపోతే రాష్ట్రం , బ్యాంకులు కుప్పకూలుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవో అవర్లో మాట్లాడటానికి అవకాశం కల్పిస్తే ఏ అంశంపై అయినా మాట్లాడవచ్చు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లవచ్చు. అయితే ప్రభుత్వం స్పందించాలని ఏమీ లేదు. కానీ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు మాత్రం రికార్డుల్లోకి వెళ్తాయి.
ఏపీ ప్రభుత్వ అప్పులపై ఇప్పటికే కేంద్రం దృష్టి పెట్టిందన్న ప్రచారం.. ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విషయంలో ఆర్బీఐ ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం వంటి అంశాలపై ఇప్పటికే దుమారం రేగుతోంది. ఇప్పుడు రఘురారాజు లేవెనత్తి అంశాలపై పీఎంవో దృష్టి సారిస్తే.. ఎంతో కొంత కదలిక వస్తుందన్న అంచనాలు ఉన్నాయి.