ఆరెంజ్ గుర్తుంది కదా? ‘మగధీర’ తరవాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా అది. మగధీర తో ఎంతో ఎత్తుకు ఎదిగిపోయిన చరణ్.. ఆ సినిమాతో కాస్త కిందకు దిగాల్సివచ్చింది. ‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ తరవాత భాస్కర్ నుంచి వచ్చిన సినిమా. ఈ సినిమా తరవాతే భాస్కర్ డౌన్ ఫాల్ మొదలైంది. ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదు, కాలంతో పాటు తగ్గుతూ ఉంటుంది – అనే మనస్తత్వం కథానాయకుడిది. చాలామందిని ప్రేమిస్తాడు. అన్నీ బ్రేకప్ కథలనే. చివరకొచ్చేసరికి హీరోయిన్ దగ్గర లాక్ అవుతాడు.
ఇదే ఫార్మెట్… `మిస్టర్ మజ్ను`లోనూ కనిపిస్తోంది. విక్కీ అనే అల్లరి కుర్రాడి కథ ఇది. అమ్మాయిల్ని ప్రేమించడం హాబీ. ఏ ఒక్కరినీ నెల రోజులకు మించి ప్రేమించడు. కానీ అమ్మాయి మాత్రం శాశ్వతమైన ప్రేమ కోరుకుంటుంది. ఈ కాన్సెప్ట్ ట్రైలర్లోనే చూపించేశాడు దర్శకుడు. అలా.. ఆరెంజ్కీ, మజ్నుకీ దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి. చరణ్‌కి ఫ్లాప్ ఇచ్చిన ఈఫార్ములా అఖిల్ విషయంలో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో ఆసక్తిగా మారుతోంది. ‘తొలి ప్రేమ’ కూడా కొత్త కథేం కాదు. అలాంటి కథలు తెలుగు తెరపై చాలా చూశారు జనాలు. కానీ… వెంకీ అట్లూరి ఏదో మ్యాజిక్ చేశాడు. ఆ మ్యాజిక్ మజ్నుకీ తోడైతే… అఖిల్‌కి తొలి హిట్టు పడడం ఖాయం.