ముద్రగడ పద్మనాభంకు జగన్ రెడ్డి హ్యాండిచ్చారు. ఆయనకు లేదా అయన కొడుక్కి పెద్దాపురం లేదా కాకినాడ టిక్కెట్ అని ప్రచారంలో పెట్టారు. ఇది నిజమేననుకుని ముద్రగడ కూడా రెడీ అయిపోయారు. తీరా జాబితాల మీద జాబితాలు కసరత్తులు చేస్తున్నారు కానీ.. ముద్రగడకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి పిలుపు రావడం లేదు. అసలు తన పేరు పరిశీలనలో లేదని తేలడంతో ఆయన వెంటనే తన మార్క్ బ్లాక్ మెయిల్ రాజకీయం ప్రారంభించారు.
ఇటీవల పవన్ కల్యాణ్ కాపు పెద్దలు తనపై ఎన్ని ఆరోపణలు చేసినా లైట్ తీసుకుంటానని .. వైసీపీలో అవమానాలకు గురై ఎప్పుడు వచ్చినా తాను ఆదరిస్తానని ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఈ మాత్రం సందిస్తే చాలని అనుకుంటున్నారేమో కానీ జనసేనతో టచ్ లోకి వెళ్లిపోయారు. జనసేన నేతలు బొలిశెట్టి, తాతాజీ, కాపు జేఏసీ నేతలు బుధవారం కలిశారు. మర్యాదపూర్వకంగా ముద్రగడను కలిశామని చెప్పకొచ్చారు. గురువారం ఉదయం ముద్రగడ ఇంటికి టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా వెళ్లారు. కాపులంతా ఐక్యంగా ఉండాలనే ప్రతిపాదనతోనే చర్చలు జరిపారు.
ముద్రగడ తన కొడుకు లేదా కోడలికి టిక్కెట్ కోరుతున్నారు. వైసీపీ లో మొదట టిక్కెట్ మాత్రమే కాదు ఖర్చులకు కూడా డబ్బులిస్తామని ఆఫర్ ఇచ్చారు. కానీ తర్వాత మాట్లాడటం మానేసారు. వైసీపీపై ఆశతో ఒకటో తేదీన తన ఇంట్లో అనుచరుల్ని పిలిచి విందు ఇచ్చారు. కానీ వైసీపీ లో క్లారిటీ రాకపోవడంతో ఏమీ చెప్పలేకపోయారు. ఇక జగన్ పట్టించుకోరనో.. లేకపోతే త్వరగా తేల్చాలనో కానీ… జనసేన, టీడీపీ నేతలను ఇంటికి పిలిపించుకుంటున్నారు.