కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి రేపతామని వైసీపీ నేతలు హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ఖచ్చితంగా ఘర్షణ జరుగుతుందని పేర్ని నాని ముందే హెచ్చరించారు. పోలింగ్ ఏజెంట్లకు సజ్జల కూడా ఇవే సూచనలు చేశారు. రూల్స్ ఫాలో అయ్యే వారు వెళ్లవద్దని అల్లర్లు చేసే వారే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. సజ్జల మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ అంశంపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. కౌంటింగ్ కేంద్రాల్లో అలజడి సృష్టిస్తే కణాల్లోనే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామని వివరించారు. అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు, ఆయా అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఈ అంశాలను గమనించాలని అన్నారు. కౌంటింగ్ సెంటర్ల లోపల ఏజెంట్లు అల్లరి చేసినా వెంటనే అరెస్ట్ చేస్తారు. అలా చేయడం వల్ల వైసీపీకే ఏజెంట్లు లేకుండా పోతాుర.
అధికార పార్టీ అల్లర్ల హెచ్చరికల మధ్య ఇంటలిజెన్స్.. మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కౌంటింగ్ సెంటర్ల లోపల మరింత భద్రత కట్టుదిట్టం చేయడంతో ఉ్దదేశపూర్వకంగా గొడవలు చేసే వారిని గుర్తించి ముందుగానే వెనక్కి పంపించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. పోలింగ్ సమయంలో జరిగిన ఘర్షణల వల్ల పడిన మరకను.. సమర్థమైన కౌంటింగ్ నిర్వహణతో తొలగించుకోవాలని ఈసీ పట్టుదలగా ఉంది.