ములాయంసింగ్ యాదవ్ లాంటి నేతలు ఉంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి ప్రధానమంత్రి కావడం ఖాయమేననే కామెంట్లు .. చివరి రోజు లోక్ సభ సమావేశాల అనంతరం… పార్లమెంట్ ప్రాంగణంలో ఎక్కువగా వినిపించాయి. ఓ వైపు.. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం.. ములాయం సింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ పై.. తీవ్రమైన దిగ్భంధనం అమలు చేస్తూ ఉంటే… ములాయం మాత్రం.. లోక్ సభలో.. మరోసారి మోదీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీని లోక్ సభ చివరి ప్రసంగంలో సొంత పార్టీ నేతను పొగిడినట్లు పొగిడేశారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నానని బహిరంగంగాప్రకటించారు. అందరినీ కలుపుకొని వెళ్లడంలో మోదీ సమర్థులని కితాబిచ్చారు. మీవెంటే ఉంటామని ములాయం సింగ్ యాదవ్ చెప్పడంతో.. మోదీ కూడా… బల్లలు చరిచి సంతోషం వ్యక్తం చేశారు.
తమ గెలుపునకు ఇదే పెద్ద సూచిక అని బీజేపీ సభ్యులు సంతోషపడ్డారు. ములాయం ఇప్పుడే ఆశీర్వాదాలు ఇచ్చారని భవిష్యత్తులో మరిన్ని ఉన్నతమైన కార్యక్రమాలు చేపడుతామని మోదీ చెప్పుకొచ్చారు. ములాయం సింగ్ యాదవ్… మోదీకి ఎందుకు సర్టిఫికెట్ ఇచ్చారన్నదానిపై ఢిల్లీ వర్గాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో.. అఖిలేష్ యాదవ్ పై.. సీబీఐ, ఈడీ వంటి రాజ్యాంగ సంస్థలతో దాడులు చేయించారు. ఆయనను త్వరలో పిలిపించి ప్రశ్నిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే.. ఆయన బీజేపీ పట్ల సానుకూల భావనతో మాట్లాడి ఉంటారని అంచనాలు ఉన్నాయి.
మరో వైపు.. ఎస్పీ, బీఎస్పీ.. ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీపై.. తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నాయి. దశాబ్దాల వైరం మానుకుని పొత్తులు పెట్టుకుని రాజకీయ యుద్ధం చేస్తున్నాయి. బుధవారం.. ఓ యూనివర్శిటీకి వెళ్లడానికి సిద్ధమైన అఖిలేష్ యాదవ్ ను అక్కడి ప్రభుత్వం అడ్డుకుంది. ఈ క్రమంలో భారీ ఉద్రిక్తత ఏర్పిడంది. ఓ ఎస్పీ ఎంపీకి గాయమవడంతో.. ఆయన ఆ గాయానికి కట్టుతోనే పార్లమెంట్ కు వచ్చి.. ప్రసంగించారు. అయినా… ములాయం మాత్రం… మోదీని పొగిడి.. లోక్ సభ సమావేశాల చివరి రోజు.. విపక్షాలన్నింటికీ ఓ షాక్ ఇచ్చారు.