హాలీవుడ్ సినిమా `అవెంజర్స్ ఎండ్ గేమ్`కి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తమిళ డైలాగులు రాస్తున్నారు. `అవెంజర్స్` ప్రాంచైజీకి ఇండియాలో అభిమానుల సంఖ్య ఎక్కువే. తమిళనాడులోనూ `అవెంజర్స్’ చిత్రాలను అభిమానించే ప్రేక్షకులున్నారు. వారిలో సినిమాపై మరింత క్రేజ్ పెంచేందుకు మార్వెల్ ఇండియా మురుగదాస్ని మాటల రచయితగా తీసుకుంది. ఇప్పటివరకూ తాను దర్శకత్వం వహించిన చిత్రాలకు మాత్రమే మురుగదాస్ మాటలు రాసుకున్నారు. ఆయన సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి కానీ… మురుగదాస్ ఓ కథ రాసి ఇతరులకు ఇచ్చినది లేదు. ఇతర సినిమాలకు మాటలు రాసింది లేదు. అందువల్ల, తొలిసారి మురుగదాస్ ఓ చిత్రానికి మాటలు రాస్తున్నాడు, అదీ హాలీవుడ్ హిట్ ఫ్రాంచైజీలో వస్తున్న సినిమాకు తమిళ్ డైలాగ్స్ రాస్తున్నాడు అనేది ఆడియన్స్ని అట్ట్రాక్ట్ చేసే అంశమే. తమిళ్లో మురుగదాస్ రాస్తున్నారు. తెలుగులో ఎవరు రాస్తారో??