జగన్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖ ఎంపీగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం పెను సంచలనం అయింది. కిడ్నాప్ చేసిన రెండు రోజుల వరకూ బయటకు రాకపోవడంతో పాటు.. బయటకు తెలిసిన వెంటనే సినిమా స్టైల్లో ముగింపు ఇచ్చారు పోలీసులు. కనీసం ఏం జరిగింది.. ఎందుకు జరిగింది.. ఎలా జరిగిందన్నది ఎవరికీ తెలియలేదు. ఏదో జరగిందని మాత్రం చెప్పారు.
అది కిడ్నాప్ కాదని.. సెటిల్మెంట్ అని.. పెద్ద గూడు పుఠాణి ఉందన్న అభిప్రాయం కొద్ది రోజులుగా ఉంది. ఇప్పుడు ఈ విషయంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు ఏపీ ప్రభుత్వం సీనియర్ ఆఫీసర్ని నియమించింది. ఆయన గుట్టుగా రీఇన్వెస్టిగేషన్ ప్రారంభించారని తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రౌడీషీటర్ జైల్లో ఉన్నారు. ఆయనను కలిసి పోలీసులు వివరాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ఎంవీవీ సత్యనారాయణతో పాటు కిడ్నాప్‌కు గురైన ఆయన కుటుంబసభ్యుల నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్లు రికార్డు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ఎంవీవీకి జగన్ దెబ్బ పీక్
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత జగన్ ను ఎంవీవీ సత్యనారాయణ కలిశారు. ఆ తర్వాత సాక్షి పత్రికలో రెండు ఫుల్ పేజీ ప్రకటలను.. తన రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు పేరుతో ఇచ్చారు ఎంవీవీ. ఆయన ఆ స్థాయిలో ప్రకటనలు ఇవ్వడం గతంలో ఎప్పుుడూ లేదు. ఇదందా… ఓ ల్యాండ్ సెటిల్మెంట్ వ్యవహారం అని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎంవీవీ విశాఖలో కనిపించడం లేదు. ఆయనపై పలు రకాల ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే ఆయన సన్నిహితుడు ఆడిటర్ జీవీ కూడా ఆజ్ఞాతంలో ఉన్నారు. ఈ కిడ్నాప్ కేసు మూలాలలను చేధించి.. ఆర్థిక వ్యవహారాలను బయటకు తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.