వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత రాజకీయపార్టీలు.. తమ తమ ప్రకటనలు చేస్తున్నాయి. ఈ హత్య కేసులో చాలా అనుమానాలున్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి.. రెండు పార్టీలు.. ఎవరికి వారు తీర్పులు ఇచ్చేసుకున్నారు. ఎదుటి పార్టీలను నిందితులుగా తేల్చేశాయి. ఈ క్రమంలో.. అసలు మిస్టరీ బయటకు వస్తుందా..? లేదా..? అన్న ఆందోళన కలుగుతోంది. ఈ మిస్టరీ వీడాలంటే.. దర్యాప్తు చాలా అవసరం.
హత్యను సహజమరణంగా ఎందుకు చిత్రీకరించారు..?
వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎందుకు దాచి పెట్టారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. దీనికి అవినాష్ రెడ్డి… తాము హత్య అని చెబితే.. అల్లర్లు చెలరేగితే.. తప్పు ఎవరి మీదకు నెడతారని కౌంటర్ ఇచ్చారు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లిన తర్వాత కూడా… ఇది హత్య అని చెప్పలేదు. సహజమరణం అని డాక్టర్లను, పోలీసుల్ని నమ్మించే ప్రయత్నం చేశారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఇది ఎస్టాబ్లిష్ చేయాల్సిన మొదటి అంశం. ఘటన జరిగినప్పటి నుంచి బయటకు వచ్చే వరకూ… ఏం జరిగిందనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఘటనను దాచి పెట్టాల్సిన అవసరం కుటుంబసభ్యులకు ఏముందని… ప్రశ్నించి.. చంద్రబాబు జడ్జ్మెంట్ ఇచ్చేశారు. క్లియర్‌గా హత్య అని తెలుస్తున్నా.. ఎందుకు పోస్టుమార్టం జరిగే వరకూ హత్య అని చెప్పలేదు.
సాక్ష్యాలను ఎందుకు తుడిచేశారు..?
ఏదైనా హత్య ఘటన జరిగినప్పుడు… పంచనామా జరిగిన తర్వాతే… మిగతా పనులు చేయాలి. అయితే వివేకానందరెడ్డి హత్య విషయంలో మాత్రం… రక్తం మరకలతో సహా మొత్తాన్ని తుడిచేశారని చంద్రబాబు చెబుతున్నారు. దర్యాప్తులో ఎప్పుడైనా సీన్ ఆఫ్ అఫెన్స్ కీలకం. వివేకానందరెడ్డి కేసులో.. ఈ సాక్ష్యాలను ఎవరైనా ట్యాంపర్ చేశారా..?. సాక్ష్యాలను ట్యాంపర్ చేయడం తీవ్రమైన నేరం.
లెటర్ ఎక్కడ్నుంచి వచ్చింది..?
వివేకానందరెడ్డి రాసినట్లు చెబుతున్న ఇప్పుడు కీలకంగా రాసింది. దారుణంగా హత్య చేస్తున్నప్పుడు.. ఎలా లెటర్ రాస్తారని.. జగన్ ప్రశ్నిస్తున్నారు. పోలీసులు సీన్ ఆఫ్ అఫెన్స్‌లో ఆ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారని మొదట చెప్పారు. జగన్ చెప్పిందే వాలీడ్ క్వశ్చన్. ఆ పరిస్థితుల్లో ఎవరూ రాయలేరు. అయితే.. ఆ లెటర్‌ను కుటుంబసభ్యులే పోలీసులకు ఇచ్చారని చంద్రబాబు చెబుతున్నారు. ఎందుకు దాచి పెట్టారని.. సాయంత్రం వరకూ పోలీసులకు ఎదుకివ్వలేదని ప్రశ్నించారు. నిజంగా ఆ లెటర్ ఎవరిది..? దాన్ని వివేకానందరెడ్డి రాశారా..? సృష్టించారా.. అన్నది దర్యాప్తుల్లో తేలాల్సి ఉంది.
కేసు పెట్టవద్దని ఎందుకన్నారు..?
కేసులు పెట్టవద్దని… వైఎస్ అవినాష్ రెడ్డి అన్నట్లుగా చెబుతున్నారు. కానీ ఆయన మాత్రం… అనుమానాస్పద మృతిగా కేసు పెట్టమని చెబుతున్నామని అంటున్నారు. అలాగే… సీసీ కెమెరాలు మూడు రోజులుగా పని చేయడం లేదంటున్నారు. అలాగే ఇంటి వెనుక తలుపు ఎవరు తీశారు..? ఒక్కరే ఎందుకున్నారు..? ఇలా.. చాలా అనుమానాలున్నాయి. కానీ ఎవరికి వారు తమకు అనుకూలమైన సమాధానం ఇచ్చుకుంటున్నారు.
తీర్పులిచ్చేసుకుంటున్న రెండు పార్టీలు..!
వివేకానందరెడ్డి హత్యపై… అటు.. వైసీపీ, టీడీపీ… రెండు పార్టీలు.. రకరకాల వాదనలు… వినిపిస్తున్నాయి. ఎవరికి వారు పక్క వాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారు. కానీ.. వారు చేసుకునే ఆరోపణలన్నీ ఏ మాత్రం నమ్మశక్యం కానివి. అసలు విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.