మైత్రీ మూవీస్ సంస్థ మంచి పామ్‌లో ఉంది. వరుస విజయాలు అందించిన ధైర్యమో ఏమో.. తన తదుపరి సినిమాలపై భారీగా ఖర్చు పెడుతోంది. హీరోల మార్కెట్, రేంజ్ కూడా పట్టించుకోకుండా డబ్బులు వెదజల్లుతోంది. రవితేజ – శ్రీనువైట్ల సినిమా మేకింగ్‌లోనూ ఇది కనిపిస్తోంది. అటు రవితేజకు, ఇటు శ్రీనువైట్లకు వరుస పరాజయలు పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాని వీలైనంత తక్కువలో తీసుకుంటే… మంచిదనుకుంటారు. కానీ.. మైత్రీ మాత్రం అలా ఆలోచించడం లేదు. టెక్నికల్‌గా హై స్టాండర్డ్‌లో ఈ సినిమాని తీసుకురావాలని భావిస్తోంది. అందుకోసం కొత్త కొత్త టెక్నాలజీని వాడుకుంటోంది. ఈ సినిమా కోసం రెడ్ మాన్ స్ట్రో కెమెరాని వాడుతున్నార్ట 8 కె రెజుల్యూషన్ తో రూపొందుతున్న తొలి తెలుగు సినిమా ఇదే అని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరణ జరుగుతోంది. మరో 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది. ఇలియానా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ – శ్రీనువైట్ల అంటే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది ఈ సినిమాలో ఎంత ఉందో తెలీదు గానీ, టెక్నికల్ విషయంలో మాత్రం చిత్రబృందం కొత్తగా ఆలోచించడం మొదలెట్టింది. మరి కామెడీ ఏ రేంజులో ఉంటుందో..?