బీహార్‌లో దాణ స్కాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గేదెలకు దాణా పేరుతో రాజకీయ నేతలు నిధులు బొక్కేశారు. దాంతో లాలూయాదవ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఏపీని మరో బీహార్‌లా చేసేసిన జగన్ రెడ్డి… లాలూ కాదు… అంతకు మించి అని నిరూపించారు. జనసేన నేత నాదెండ్ల మనోహర్ బయట పెట్టిన విషయాలు చూస్తే… వార్నీ అనుకోక తప్పదు.
ఏపీలో పాల వెల్లువ పేరుతో.. 2887 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3,94,000 పశువులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలోనే చెప్పారు. వాటిలో ఇప్పుడు రాష్ట్రంలో 3,85,000 పాడి పశువులు కనిపించడం లేదని అధికారులు చెబుతున్నారు. అంటే.. కొన్న గేదెలన్నీ కనిపించడం లేదు. అధికారులు లెక్కలు తెలిస్తే కేవలం 8000 పశువులు మాత్రమే క్షేత్ర స్థాయిలో ఉన్నాయి. మరి మిగతా గేదెలన్నీ ఏమయ్యాయి.. ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి ?
బీహార్‌లో దాణా తినేస్తే ఇక్కడ నేరుగా గేదెల్ని తినేశారన ఈ స్కామ్‌ను బట్టి అర్థమవుతుంది. పేదలకు చెందాల్సిన దాదాపుగా మూడు వేల కోట్ల రూపాయల నిధుల్ని స్వాహా చేశారు. ఎవరు చేశారు.. ఎలా చేశారన్నది విచారణ జరిగితే బయటకు వస్తుంది. కానీ ఇలా వివరాలు బయట పెట్టినందుకు … నాదెండ్ల మనోహర్ పై ఏదో ఓ కేసును అర్జెంట్ గా నమోదు చేస్తారు. ఏపీలో ఉండే రాజకీయం అందే.