జగన్ తో సినీ పరిశ్రమ భేటీ సందర్భంగా అమరావతి వెళ్లిన సినీ పరిశ్రమ బృందాన్ని అమరావతి రైతులు కలవడానికి ప్రయత్నించడం, రాజధానిగా అమరావతిని కొనసాగించేలా జగన్ తో మాట్లాడాలని సిని బృందాన్ని కోరే ప్రయత్నం చేయడం, రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం జోలికి వెళ్లడం ఎందుకన్న ఉద్దేశంతో వారు అమరావతి రైతుల ధర్నాను పట్టించుకోకుండా వెళ్లి పోవడం తెలిసిందే. అయితే ఈ భేటీలో అనేకమంది సినీ పెద్దలు ఉన్నప్పటికీ ఏబీఎన్ టీవీ 5 ఛానల్స్ డిబేట్ లు పెట్టి కేవలం చిరంజీవిపై విరుచుకుపడడం తెలిసిందే.
Read Also: చిరంజీవి మీద విరుచుకుపడ్డ ఏబీఎన్ , టీవీ5
టిడిపి అనుకూల చానల్స్ గా ముద్రపడ్డ ఈ రెండు చానల్స్ చిరంజీవిని టార్గెట్ చేయడంపై మెగా అభిమానులు విమర్శిస్తున్నారు. ఈ అంశం పై స్పందించిన నాగబాబు ట్వీట్ చేస్తూ, ” టీడీపీ జెండాని అజెండా ని మోస్తున్న కొన్ని తెలుగు వార్త చానెల్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.టీడీపీ పార్టీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని,టీడీపీ పట్ల వాళ్లకున్న అనురాగం,మన వాడు చంద్రబాబు నాయుడు గారు అన్న అభిమానం ,మన చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం,మనబాబు కి ఉపయోగపడినంత కాలం..ఓడ మల్లయ్య అని,, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తూ,, బాబోరి ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా వారు చూపిస్తున్న తెగువ,బాబుగారి కి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు wow ఇది అసలైన వార్తా.. పత్రికల స్పిరిట్ అంటే..శభాష్…(ఒక్కోసారి జగమ్మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అని doubt వస్తుందేంటి)” అని రాసుకొచ్చారు.
మొత్తానికి నిన్నమొన్నటిదాకా టిడిపి తో సమానంగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించిన జనసేన కార్యకర్తలు , నాయకులు – టిడిపి అనుకూల ఛానల్స్ మెగా కుటుంబం పై విషం కక్కుతున్న వైఖరి చూసిన తర్వాత పంథా మార్చుకుని టిడిపిని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ చానల్స్ కి జగన్మోహన్రెడ్డి కరెక్ట్ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి.