సన్నాసిగాళ్లు, సొల్లుగాళ్లు, ఎదవ . రాస్కెల్స్, వేస్ట్ ఫెలోస్… ఇలాంటివన్నీ.. మనం ఎదుటివాడ్ని కొట్టలేనప్పుడు… ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు.. అహం చల్లార్చుకోవడానికి… తిడుతూ ఉంటాం. ఇప్పుడు నాగబాబు కూడా అహం చల్లార్చుకుంటున్నారు. ప్రత్యర్థులు బలవంతులు. వాళ్లును ఎదుర్కొనే ధైర్యం కూడా లేదు. అలాంటప్పుడు ఏం చేస్తారు..?. ఏం చేయగలరు.? బండబూతులు తిట్టి.. వాడికేదో హాని చేసినట్లు..మనకు మనం సంతృప్తి పడతాం. ఇది చిన్న పిల్లలు, మైండ్ మెచ్యూర్డ్ కాని వాళ్లు చేసే పని. ఎదుటి వాడిపై ఎంతగా నోరు పారేసుకున్నా.. వాళ్లకేమీ కాదు. కానీ.. నోరు పారేసుకున్న వాళ్లకే ఇబ్బంది. ఆ విషయం గ్రహించకపోతే.. మైండ్ మెచ్యూర్డ్ కానట్లే లెక్క. దానికి వయసుతో సంబంధం లేదు. అచ్చంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు పవన్ కల్యాణ్ అన్నయ్య నాగేంద్రబాబు.
వెధవ నుంచి పశువు వరకూ.. నాగబాబు తిట్ల పురాణం…!
నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గ బరిలో నిలబడిన నాగబాబులో ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరుతోంది. ఆయన ప్రచారం అనుకున్నట్లు సాగట్లేదనో… అందరూ సినిమా యాక్టర్‌గానే చూస్తున్నారనో.. .. ఓట్లడిగినప్పుడు… నాగబాబు మార్క్‌లో.. జబర్దస్త్ స్టైల్లో ఓటర్లు నవ్వుతున్నారనో కానీ.. ఆయన తన ఫ్రస్ట్రేషన్‌ను అంతకంతకూ పెంచుకుని.. ఎవరైనా ఇంటర్యూలు అంటూ వస్తే వాళ్ల ముందు బయటపడిపోతున్నారు. మొన్నో చానల్ ఇంటర్యూ చేసింది… అందులో… ప్రతి ప్రశ్నకు ముందు.. ఎదుటి పార్టీ అభ్యర్థులపై తిట్లు.. ఆ తర్వాతే సమాధానం ఉంది. ఆ తిట్లలో ఓ భాగం… యూజ్ లెస్ ఫెలోస్, పనికి మాలిన సన్నాసులు, ఈ సన్నాసిగాళ్లు, సొల్లుగాళ్లు, ఎదవ మాటలు. సిగ్గుందా.. , రాస్కెల్స్, వేస్ట్ ఫెలోస్, వీళ్ల బతుకులు , ఎదవ స్ట్రాటజీ, వాడెవడు.. వాడేం మనిషా.. పశువా..!… ఇవన్నీ ఓ భాగమే రాసుకుంటే… ఆ ఇంటర్యూ మొత్తం బూతులే ఉన్నాయి. ప్రత్యర్థుల్ని తిట్టి.. తన అహాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేశారు.
నిలబెట్టిన జబర్ధస్త్ అంటే అంత చులకన ఎందుకో..?
జబర్దస్త్ అనే ప్రోగ్రామ్‌కు జడ్జిగా … ఉండి.. తన ఆర్థిక జీవితాన్ని్ మెరుగుపరుచుకున్న నాగబాబు… ఆ ఫార్ములాను మొత్తం… రాజకీయాల్లోకి తెచ్చేశారు. అసలే ఆ ప్రోగ్రాంలో ఉండే బూతులపై.. చాలా కంప్లయింట్లు ఉన్నాయి. సగటు మనిషి బలహీనతల్ని క్యాష్ చేసుకోవడానికి.. బూతు కామెడీతో ఆ షోను నడిపిస్తున్నారని.. అందరూ తిడుతూ ఉంటారు. ఇక షోలో ఉండే తిట్లు.. డబుల్ మీనింగులు, సమాజంలో ఉండే అన్ని వర్గాల వారిని అవమానించడం సంగతి సరే సరి. అలా.. ఇతరుల్ని కించపరిచి.. దాన్నే కామెడీ అనుకుని.. నాలుగురాళ్లు నాగబాబు సంపాదించుకుంటున్నారు. ఆయన ఉద్దేశంలో జబర్ధస్త్‌ది అంతే చీప్ కామెడీ ఆ ఇంటర్యూల్లో చెప్పారు కూడా. లోకేష్ సీఎం అయితే రోజూ జబర్ధస్త్ అవుతుందట. లోకేష్‌పై రగిలిపోతున్న నాగబాబు.. ఎంత చీప్ ఉద్దేశంతో ఆ మాట అన్నాడో కానీ… జబర్ధస్త్ పై ఆయనకు ఉన్న అభిప్రాయాన్ని కూడా తెలియ జేస్తోంది.
మిమ్మల్ని చూసే కదా సగటు ఫ్యాన్స్ అలా వ్యవహరిస్తోంది..!
మామూలుగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంటే… బూతులకు ప్రసిద్ధి. అక్కడ ఉన్న రేణుదేశాయా… మరోకరా అన్నది కాదు.. పవన్ కల్యాణ్‌ని ఏమైనా అంటే… ఇష్టం వచ్చినట్లు తిట్టేయడమే వారికి తెలిసింది. సోషల్ మీడియాలో ఈ తరహా భావదారిద్ర్యానికి కారణం మెగాభిమానులే. వారెందుకు అలా తయారయ్యారంటే… నాగబాబు లాంటి వాళ్లనే చూసి అని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. తాము అభిమానించే వారే.. ఇలా ఉంటే.. ఇక తాము ఎలా ఉండాలన్న ఉద్దేశంతో అలా చెలరేగిపోతున్నట్లుగా ఉన్నారు. వాళ్లకు ముంచి చెప్పే పరిస్థితిలో నాగబాబు లేరు. ఎందుకంటే.. ఆయన కూడా ఆ బాపతే. అందుకే.. ఇక మెగా సేన.. జనసేన ఎవరైనా నోరు విప్పేటప్పుడు.. చెవులు మూసుకోవాల్సిందే…