సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్న వారికి జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడకుండా.. సోషల్ మీడియాలో , బయట గొడవలు పెట్టుకుని .. పార్టీకి చెడ్డపేరు తెచ్చుకునే వారిని ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ విషయంలో జీరో టోలరెన్స్ పాటిస్తామని హెచ్చరిస్తూ ప్రకటన చేశారు. జనసేన శ్రేణులు దాదాపుగా అంతా కలిసిపోయారు. కానీ హిడెన్ ఎజెండాలతో ఉన్న కొంత మంది మాత్రం తేడాగా వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి వారిలో కేడీఎస్ అని పిలుచుకునే కల్యాణ్ దిలీప్ సుంకర కూడా ఉన్నారు. సుంకర కల్యాణ్ దిలీప్ అనే లాయర్ కమ్ అప్రకటిత జనసేన నేత సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. జనసేనకు మేలు చేస్తున్నాడో. కీడు చేస్తున్నాడో ఆయనకూ తెలియదు. సప్తగిరి ఎల్ఎల్బీ సినిమాలో తన క్లైంట్ కు చిన్న శిక్షతో పోయే కేసును ఉరిశిక్షలాగా తెచ్చే లాయర్ వాదించినట్లుగా .. తన వీడియోల్లో వాదిస్తూంటారు. అవి కొంత మందికి నచ్చుతాయి కానీ..జనసేనకు భారీ డ్యామేజ్ చేస్తూంటాయి. వైసీపీ బూతుల కింగ్ వర్రా రవీంద్రారెడ్డికి మంచి ప్రెండ్ కేడీఎస్. ఇటీవల ఆయన పొత్తులపై వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇవి శృతి మించిపోవడంతో నాగబాబు పరోక్షంగా ఈ లెటర్ విడుదల చేశారని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
కల్యాణ్ దిలీప్ సుంకరకు, మహాసేన రాజేష్ కు మధ్య వ్యక్తిగత వివాదాలు ఉన్నాయి. వాటిని దిలీప్ సుంకర పార్టీకీ అంటించేసి రచ్చ చేస్తున్నారు. నిజానికి పవన్ కల్యాణ్… దిలీప్ సుంకరను ఎప్పుడూ చేరదీయలేదు. ఆయన జనసేనలో యాక్టివ్ మెంబర్ కూడా కాదు. ఆయనకు పార్టీ బాధ్యతలు ఎప్పుడూ ఇవ్వలేదు. కానీ అలా తాను జనసేన పార్టీ అని చెప్పుకుంటూ ఆ పార్టీకి డ్యామేజ్ చేసేలా వ్యవహరిస్తూ ఉంటారన్న ఆరోపణలు మాత్రం వస్తూంటాయి.