జేమ్స్ కామెరూన్ అవతార్ 2 పై నిర్మాత నాగావంశీ కామెంట్స్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చూసిన వంశీ.,.”మెరైన్ బయోలజీ డాక్యుమెంటరీ చూడాలనుకునే జేమ్స్ కామెరూన్ ఆదేశించారు. త్రీడీలో చిత్రీకరించారు కాబట్టి అవతార్ 2ను విజువల్ వండర్ అనాలి. మాస్టర్ క్రాఫ్ట్, బ్లాక్ బస్టర్ అని మెచ్చుకోవాలి. లేకపోతే నావీ అంగీకరించదు’’అంటూ ట్వీట్లు పెట్టారు. వంశీ ట్వీట్స్ పై పెద్ద దుమారమే రేగింది. రీమేక్ సినిమాలు తీసుకునే నిర్మాత కూడా అవాతర్ గురించి మాట్లడటమే అంటూ కొందరు తీవ్రంగా విమర్శించారు.
అయితే ఇప్పుడు ఈ టాపిక్ మరోసారి నాగవంశీ స్పందించారు. ఆయన నిర్మాణంలో బుట్ట బొమ్మ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో యాంకర్ సుమ.. నాగవంశీని ఈ టాపిక్ పై ప్రశ్నించింది. మరోసారి ఆయన తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ”రాజమౌళి, త్రివిక్రమ్ సుకుమార్ లాంటి దర్శకులు సినిమాలు తీస్తే బోలెడు మంది విమర్శిస్తూ ట్వీట్లు పెడతారు. ఎవరో మనకి తెలియని జేమ్స్ కామెరూన్ అనే దర్శకుడు ఒక సినిమా తీస్తే ఆ సినిమా నాకు నచ్చకపొతే నేను అభిప్రాయం చెప్పడం తప్పా ? నాకు అభిప్రాయం చెప్పుకునే అవకాశం కూడా లేదా ? మూడు గంటలు పాటు నడిచిన సినిమా ఎంత విజువల్ వండర్ అయినా త్రీడీ కళ్ళజోడు పెట్టుకుని చూసే క్రమంలో నాకు తలనొప్పి వచ్చింది. ఆ సినిమాకి ఇచ్చిన హైప్ కి సినిమా మ్యాచ్ కాలేదు. నా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. ఇందులో తప్పేంటి ?” అంటూ ఎదురుప్రశ్న వేశారు నాగవంశీ. మరి ఆయన ఎదురుప్రశ్నకు ఆడియన్స్ నుండి ఎలాంటి సమాధానాలు వస్తాయో చూడాలి.