జీవితాన్ని ఆస్వాదిస్తూ గడపడం ఎలాగో నాగార్జునకు బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ రిలాక్స్డ్గా కనిపిస్తుంటారాయన. తన అలవాట్లు కప్పిపుచ్చుకోవడానికి ఏమాత్రం ప్రయత్నించరు. ‘మీరు ఆల్కాహాల్ తీసుకొంటారా’ అని సూటిగా ఎవరినైనా అడిగితే సమాధానాలు చెప్పడానికి ఇష్టపడరు. కానీ నాగ్ అలా కాదు. ‘మధ్యాహ్నం రెండు బీర్లు తాగి, బిరియానీ తిని, రెండు గంటలు హాయిగా పడుకొన్నా’ అని చెప్పేయగలరు. ఈరోజు అదే జరిగింది. ‘రాజు గారి గది 2’ సక్సెస్ మీట్లో నాగ్ టాపిక్ సండే మెనూ వైపుకు వెళ్లింది. ”ఈ సండే చాలా సంతోషంగా గడిపా. గత కొన్ని రోజులుగా చైతూ పెళ్లి హడావుడిలో ఉన్నా. ఈ రోజు రిలాక్డ్స్ గా గడిపా. మధ్యాహ్నం చికెన్ బిరియానీ తిన్నా. అంతకు ముందే రెండు బీర్లు తాగా. రెండు గంటలు హాయిగా పడుకొన్నా” అంటూ సండే మెను మొత్తం చెప్పేశారు. నాగ్ నోటి నుంచి బీర్లు, బిరియానీ మేటర్ ఎప్పుడైతే వచ్చిందో.. అక్కడివాళ్లంతా ఘొల్లు మన్నారు. కోడలు పిల్ల సమంతతో సహా.
రాజుగారి గది 2లో కామెడీ సీన్లు కట్ చేశారని తెలుగు 360 ముందే హింట్ ఇచ్చింది. దాన్ని నాగ్‌కూడా ఒప్పుకొన్నారు. ”కథ సీరియెస్‌గా సాగుతన్నప్పుడు కామెడీ అడ్డుపడుతోందనిపించింది. ఇదే విషయాన్ని ఓంకార్‌తో చెప్పా. తనకీ అదే అనిపించింది. మాకే కాదు.. అబ్బూరి రవికీ, పీవీపీకీ ఇదే అనిపించింది. అందుకే కామెడీ బిట్లు కట్ చేశాం” అన్నారు నాగ్.