చెరువును కబ్జా చేసి కన్వెన్షన్ కట్టినట్లుగా తనపై ముద్ర పడుతున్నందున స్పందిస్తున్నానని.. తమ కన్వెన్షన్ పూర్తి చట్టబద్దమైనదని.. ఒక్క గజం కూడా చెరువు స్థలాన్ని కబ్జా చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సమయంలో గతంలో నోటీసు ఇచ్చారని దానిపై హైకోర్టు స్టే ఇచ్చిందని .. చట్ట విరుద్ధంగా తన కన్వెన్షన్ ను అధికారులు కూలగొట్టారని ఆరోపించారు. కానీ నాగార్జున తాను ఎంతో నీతి మంతుడ్నని అధికారులదే తప్పి చెప్పేందుకు చేసిన ప్రయత్నం వికటించింది.
ఈ కూల్చివేతలపై హైడ్రా స్పష్టమైన ప్రకటన జారీ చేసింది. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయవద్దని స్టే ఎక్కడా లేదని స్పష్టం చేసింది. మూడున్నర ఎకరాలను కబ్జా చేశారని ఎన్ కన్వెన్షన్ లోని ఏ ఒక్క భవనానికి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. హైడ్రా అధికారుల ప్రకటనతో నాగార్జున అబద్దాలు చెప్పారని స్పష్టమైపోయింది. నిజానికి ఎన్ కన్వెన్షన్ ను నిర్మించినప్పటి నుంచి వివాదం ఉంది. ఆయన చెరువులో కట్టారని అందరికీ తెలుసు. దానికి రికార్డు చూడాల్సిన అవసరం లేదు. చెరువులో భాగమైన కన్వెన్షన్ చూస్తే అర్థమైపోతుంది. అయినా నాగార్జున బుకాయించే ప్రయత్నం చేశారు.
ఎన్ కన్వెన్షన్ కూల్చివేత విషయంలో నాగార్జున పై సానుభూతి చూపించేందుకు ఒక్కరంటే ఒక్కరు మందుకు రాలేదు. చివరికి బీజేపీ నేతలు కూడా ఇంత కాలం ఎందుకు ఆగారన్న ప్రశ్నలు వేశారు. బీఆర్ఎస్ నేతలు కూడా సమర్థించలేకపోయారు. వారు ఇతర ఫామ్ హౌసుల్ని చూపించి వాటిని కూలగొట్టాలని అంటున్నారు కానీ.. నాగార్జున కన్వెన్షన్ సెంటర్ ను కూలగొట్టడం తప్పనడం లేదు. ఎన్ కన్వెన్షవ్ విషయంలో ప్రజలకు ఓ అభిప్రాయం ఉంది. అందుకే చాలా మంది కూల్చివేతను సమర్థిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు.
ఇప్పుడు నాగార్జున జారీ చేసిన ప్రెస్ రిలీజ్ వల్ల ఆయన కబ్జా దారుడు కాని జనం అనుకునే పరిస్థితిలేకపోగా.. అబద్దాలు కూడా ఆడుతున్నారని.. న్యాయపరమైన విషయాల్లో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న అపవాదు మూటగట్టుకున్నారు. ఈ విషయంలో ఆయన క్రెడిబులిటీ కూడా కోల్పోయారని అనుకోవచ్చు.