ప్రకాశం బ్యారేజీ వద్ద జల ప్రవాహం పెరగడంతో గేట్లు ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. నిన్నటిదాకా రైతులకు నీళ్లు లేవు.. తాగడానికి నీరు లేదు అని హడావుడి చేశారు. కానీ ఇవాళ సమద్రంలోకి విడుదల చేయాల్సి వచ్చింది. మరి నాగార్జున సాగర్ పై చేసిన డ్రామా ఎందుకు ?
తుపాను వస్తుందని వారం రోజులకిందటే వాతావరణ శాఖ చెప్పింది. కానీ ముందు జాగ్రత్తలు.. రైతుల్ని అప్రమత్తం వంటివి చేయలేదు. పోలీసుల్ని పోలోమని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించారు. బలవంతంగా గేట్లు ఎత్తివేయించారు. ఎందుకంటే తమకు నీళ్లు కావాలని వాదించారు. ఎత్తి వదిలిన గేట్లు రైతులకు ఏమైనా ఉపయోగపడ్డాయా అంటే..లేదు. అవి కాలువలకు వచ్చే సరికి తుపాను వచ్చేసింది. మరి ఆ నీరు ఎక్కడికి చేరినట్లు.
ఇప్పుడు బలవంతంగా గేట్లు ఎత్తుకోవడం వల్ల నీరు వృధా అయింది. ప్రాజెక్టు కేంద్ర పరిధిలోకి వెళ్లింది. రేపు ఏపీ కోటా కింద విడుదల కావాల్సిన నీటిలో ఇటీవల బలవంతంగా విడుదల చేసిన నీటి కోటా ఉంటుంది. అసలు ప్రాజెక్టుల్లో నీరు లేని పరిస్థితుల్లో…ఆ నీరంతా వృధా చేసినట్లయింది. రైతుల నోట్లో మట్టికొట్టి చేసిన రాజకీయం ఎవరి కోసం ?