ఘట్టమనేని కుటుంబంలో మూడో తరం వారసుడు సిల్వర్‌స్క్రీన్‌పైకి వచ్చాడు. సూపర్‌స్టార్ కృష్ణ మనవడు, మహేష్‌బాబు కుమారుడు గౌతమ్ `వన్ నేనొక్కడినే`లో నటించాడు. మళ్లీ ఎప్పుడు నటిస్తాడా… గౌతమ్‌ని సిల్వర్‌స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడు చూస్తామా అని ఘట్టమనేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మహేష్ వారసుడు ఈసారి హీరోగా వస్తాడు. రావడం దాదాపు ఖాయమే.
పెళ్లి రోజు సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతమ్ మళ్లీ ఎప్పుడు నటిస్తాడని నమ్రతను అడగ్గా “ఒకవేళ హీరో అయితే అయినప్పుడు“ అని చెప్పారు. ఇప్పుడే గౌతమ్ హీరో అవుతాడని చెప్పడం తొందరపాటు అవుతుందనీ, గౌతమ్‌ని తాము హీరోగా చూడాలనుకుంటున్నామనీ, గౌతమ్ కూడా హీరో అవుతానని అంటున్నాడనీ, ఏం జరుగుతుందో చూద్దామనీ నమ్రత అన్నారు. బాల నటుడిగా తండ్రి కృష్ణ సినిమాల్లో నటించిన మహేష్, తరవాత హీరో అయ్యాడు. అలాగే, గౌతమ్ కూడా తండ్రి మహేష్ సినిమాలో బాల నటుడిగా కనిపించి హీరోగా రావడానికి సిద్ధమవుతున్నాడన్నమాట.