ఇక సంక్రాంతి రేసు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలుంది. రేపు మొదలు వరుసెంట మూడు రోజులు నాలుగు సినిమాలతో పండుగంతా సినిమా టాకీస్ లలోనే కనిపించేలా సందడి చేయబోతున్నాయి. అయితే ఈసారి వేరే సినిమాల పోటీ ఎలా ఉన్నా బాబాయ్.. అబ్బాయ్ ల పోటీ కీలకంగా మారింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నాన్నకు ప్రేమతో అంటూ ఓ సెన్సిటివ్ అండ్ క్రియేటివ్ ఎఫర్ట్ తో వస్తుంటే.. డిక్టేటర్ అంటూ మరోసారి సింహంలా గర్జించడానికి వస్తున్నాడు నందమూరి నట సింహం బాలకృష్ణ.
అనూహ్యంగా పోటీ పడుతున్న నందమూరి హీరోల మధ్య రసవత్తరంగా మారింది. యువత జోరు మొత్తం ఎన్.టి.ఆర్ కే సపోర్ట్ చేస్తుంటే.. నందమూరి వీరాభిమానులంతా బాలయ్యకు ఓటేస్తున్నారు. అయితే పోటీలో సీనియర్ అయిన బాలయ్య నెగ్గితే మాత్రం ఎన్.టి.ఆర్ భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ ధైర్యంతో లెజెండ్ లాంటి బాబాయ్ కే పోటీ పడాలని చూశాడో దాన్ని ప్రేక్షకులు తిప్పికొడితే మాత్రం చాలా అవమానాలు పడాల్సి ఉంటుంది.
ఇక అబ్బాయ్ వస్తున్నాడని తెలిసినా రేసులో ఉన్న బాలయ్య కూడా డిక్టేటర్ రిజల్ట్ కాస్త నిరాశ పరిస్తే తనంతట తానే ఎన్.టి.ఆర్ స్టామినాను పెంచిన వాడవుతాడు. అంతేకాదు నాన్నకు ప్రేమతో సూపర్ హిట్ అయ్యి డిక్టేటర్ పోతే కనుక కొంత అభ్యంతరకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఒకటి హిట్టు మరోటి ఫట్టు అని కాకుండా ఇద్దరు మా హీరోలే అంటూ నందమూరి అభిమానులు అనుకుంటే కనుక రెండు సినిమాలను సూపర్ హిట్ చేయడం గ్యారెంటీ.. మరి రెండు సినిమాల్లో ఏ సినిమా.. మరో సినిమాపై విజయం సాధిస్తుందో తెలుసుకోవాలంటే మరో రెండు రోజులు ఓపిక పడితే సరిపోతుంది.