ముద్దులతో కూడా వార్తల్లో చాలా ప్రాముఖ్యత సంపాదించుకోవచ్చని నిరూపించుకుంటున్నాయి హిందీ సినిమాలు. ఆ మధ్య కరీనాకపూర్- అర్జున్ కపూర్ ల ‘కి అండ్ కా’ ముద్దుల ముచ్చట్లతోనే ఆసక్తిని రేపింది. ఆ సినిమాలు వివాహిత అయిన కరీనా తన కన్నా చిన్న వాడైన అర్జున్ కపూర్ తో ఆడిన ముద్దులాట టీజర్ దగ్గర నుంచినే సంచలనంగా నిలిచింది. విడుదల వరకూ ఆ సినిమాను వార్తల్లో నిలిపాయి ఆ ఘాటు మద్దులు.
ఇప్పుడు ‘బేఫికర్’ కూడా అలాగే వార్తల్లోకి వస్తోంది. టైటిల్ కు తగ్గట్టుగా.. ఎవరినీ లెక్క చేయనట్టుగా ఈ సినిమా హీరోహీరోయిన్లు ముద్దుల పోజుల్లో కనిపిస్తున్నారు. వరసగా విడుదల అవుతున్న ఈసినిమా పోస్టర్లలో ప్రతిదాంట్లోనూ హీరోహీరోయిన్లు చాలా ఘాటైన ముద్దుల్లో మునిగి తేలుతున్నట్టుగా కనిపిస్తున్నారు. గాఢమైన ముద్దుల్లో కనిపిస్తున్న ఈ హీరోహీరోయిన్లు రణ్ వీర్ సింగ్, వాణీ కపూర్ లు. ఆదిత్య చోప్రా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ప్రతి పోస్టర్ లోనూ హీరోహీరోయిన్లు అంతే గాఢతతో కూడిన కిస్సుల్లో మునిగి తేలుతుండటం విశేషం.
వాణీకపూర్ వెనుకటికి ఒక తెలుగు కమ్ తమిళ సినిమాలో నటించింది. నాని హీరో గా యశ్ రాజ్ వారు నిర్మించిన ‘ఆహాకల్యాణం’ లో వాణీ నటించింది. హిందీలో హిట్ అయిన బ్యాండ్ బజా బారాత్ కు రీమేక్ గా ‘ఆహా కల్యాణం’ రూపొందింది. అందులో కూడా హీరో నానితో పెదవులు కలిపింది వాణీ. అందులో పెట్టిన ముద్దులు అమెకు గుర్తింపు తెచ్చి పెట్టలేదు కానీ.. ఇప్పుడు మాత్రం వాణీ ముద్దులు వారెవా.. అనిపిస్తున్నాయి!