ఈ యేడాది టాలీవుడ్ కి దక్కిన మంచి విజయాల్లో `దసరా` కూడా స్థానం సంపాదించుకొంది. కమర్షియల్ గా ఈ సినిమాకి మంచి రిజల్ట్ వచ్చింది. ఈ సినిమాకి దాదాపు 60 కోట్ల వరకూ ఖర్చు పెట్టారు. నానిపై అంత బడ్జెట్ రిస్కే. కానీ… అంచనాలు తారుమారు అయ్యాయి. ఈ సినిమా ఇప్పుడు లాభాల బాటలో పరుగు పెడుతోంది. ఈ సినిమా నాని మార్కెట్ రెట్టింపు అయ్యిందనడంలో సందేహం లేదు. నటుడిగానూ కొత్త ద్వారాలు తెరచుకొన్నాయి. ఓ కొత్త దర్శకుడ్ని నమ్మి రిస్క్ చేసినందుకు నానికి తగిన ప్రతిఫలం వచ్చేసింది. అటు డబ్బులూ వచ్చాయి. ఇటు.. పేరూ దక్కింది. కానీ ఆ ఒక్కటి తప్ప.
ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అవ్వాలని ఆశ పడ్డాడు నాని. అందుకు తగ్గట్టుగానే నార్త్ లోనూ ప్రచారం బాగా చేశాడు. ఊరూరా తిరిగాడు. ఓ రకంగా చెప్పాలంటే తెలుగులో కంటే, మిగిలిన భాషల్లోనూ ప్రమోషన్లు జోరుగా సాగాయి. అయితే.. ఈ సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కాయి కానీ నార్త్ వాళ్లు ఈ సినిమాని పట్టించుకోలేదు. అక్కడ ఎదగాలన్న నాని ప్రయత్నం బెడసి కొట్టింది. దానికీ ఓ కారణం ఉంది. నాని నుంచి వచ్చినవన్నీ క్లాస్ సినిమాలే. ఇక్కడి సినిమాలు నార్త్ లో డబ్బింగ్ రూపంలో వెళ్తాయి. ప్రభాస్, బన్నీ చేసిన యాక్షన్ సినిమాలు డబ్బింగ్ రూపంలో వెళ్లాయి. దాంతో.. వాళ్లకంటూ అక్కడ ఓ మార్కెట్ ఏర్పడిపోయింది. అలా నాని సినిమాలూ వెళ్లుంటాయి. కానీ.. నార్త్ లో యాక్షన్ సినిమాలకే ఆదరణ. నాని చేసినవన్నీ దాదాపుగా లవ్ స్టోరీలే. కాబట్టి… నానికి అంత పాపులారిటీ రాలేదు.అందుకే దసరా వైపు ఎవరూ చూళ్లేదు. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లో ఆడకపోయినా హిందీ డబ్బింగ్ రూపంలో… శాటిలైట్ లో ఇరగాడుతుంది. అంటే.. ఇకపై నాని సినిమాలకు అక్కడ గిరాకీ మొదలవుతుందన్నమాట.