ఏపీలో అరెస్టులు చేయాలంటే… ఎవరికీ తెలియకుండా కేసులు నమోదయిపోతాయి. అరెస్టులుచేసిన తర్వాతే విషయం బయటకు వస్తుంది. విచారణలు.. చట్టాలు.. సెక్షన్లు ఏమీ ఉండవు. చాలా కాలం పాటు ఇలాంటి అరెస్టులు జరిగాయి. ఇటీవల ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ అవకాశం దొరకదనుకుంటున్నారేమో కానీ ప్రారంభించేశారు. నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను ముందుగా టార్గెట్ చేశారు. ఆయన ఎక్కడ ఉంటున్నారో ట్రేస్ చేసి ఉదయమే.. ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉంటున్నారని తెలుసుకుని సీఐడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేశారు.
ఈ అరెస్టులోనూ పోలీసులు చేయాల్సిన కుట్లలన్నింటినీ చేశారు. ఆయనను పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ చేసినట్లుగా మీడియాకు లీకులు ఇచ్చారు. ఆయనను అదుపులోకి తీసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ను మీడియాకు లీక్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ కింద తిరుపతిలో కేసులు నమోదయినట్లుగా ఉంది. చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్‌కు చెందిన గిరిధర్ అనే వైస్ ప్రిన్సిపాల్ వాట్సాప్ నుంచి ఫార్వార్డ్ అయినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో నేరుగా నారాయణ సంస్థల వ్యవస్థాపకుడ్ని అరెస్ట్ చేయడం ఎలా సాధ్యం అని అనుకున్నారు. ఓ బ్రాంచి వైస్ ప్రిన్సిపాల్ వాట్సాప్ నుంచి క్వశ్చన్ పేపర్ ఫార్వార్డ్ అయితే సంస్త యజమానిని అరెస్ట్ చేస్తారా అని అందరూ ఆశ్చర్యపోయారు.
కానీ కాసేపటికే ఆయనను రాజధాని భూముల కేసులో అరెస్ట్ చేసినట్లుగాప్రచారం ప్రారంభంయింది. పాత కేసులన్నీ నీరుకారిపోగా రాత్రికి రాత్రి మళ్లీ కొత్తగా రాజధాని ల్యాండ్ పూలింగ్ కేసును మళ్లీ నమోదు చేసి మరీ అరెస్ట్ చేసినట్లుగా తెలుసుతోంది. అసలు ల్యాండ్ పూలింగ్‌లో ఏం జరిగింది… ఎక్కడ అక్రమం జరిగింది.. నారాయణ ఏం చేశారు.. ఇవన్నీ తేలాల్సి ఉంది. అక్కడేమీ లేకపోయినా ముందుగా ఆయనను అరెస్ట్ చేయాలనుకున్నారు చేశారు.. టార్గెట్ కంప్లీటెడ్ అన్నట్లుగా కొన్నాళ్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. నారాయణ విషయంలోనూ అేద జరుగుతోందంటున్నారు.