భారత్ లో ట్విట్టర్ అంటే ఎక్స్ యూజర్ల సంఖ్య ఇరవై ఐదు మిలియన్లుకు కాస్త ఎక్కువ. ఇది అధికారిక సమాచారం . కానీ భారత్ కు చెందిన ప్రధాని మోదీ ఫాలోయర్లు మాత్రం వంద మిలియన్లు దాటిపోయారు. ఇలా ఇప్పటి వరకూ ఒక్కరంటే ఒక్క లీడర్ కూ లేరు. లీడర్ కే కాదు సెలబ్రిటీకీ లేరు. హాలీవుడ్ స్టార్ టేలర్ స్విఫ్ట్ 95 మిలియన్లు దగ్గర, సింగర్ లేడీ గాగా 83 మిలియన్ల దగ్గర ఉన్నారు. బైడెన్ అయితే మోడీకి ఉన్న ఫాలోయర్లలో సగం కూడా లేరు. ఇక ప్రపంచదేశాల్లో క్రేజ్ ఉన్న విరాట్ కోహ్లీ 64 మిలియన్లు మాత్రమే.
భారత్ లో ఉన్న ఇరవై ఐదు మంది మిలియన్ల ఎక్స్ యూజన్లు మోదీని ఫాలో కాకపోవచ్చు. ఓ పది మిలియన్ల మంతి ఫాలో అవుతారు. మిగతా 90 మిలియన్ల మంది విదేశీయులే అనుకోవచ్చు. ఎంత ప్రవాసులు ఫాలో అయినా ఆ స్థాయిలో ఫాలోయర్స్ ఉండాలంటే ఖచ్చితంగా విదేశీయుల అభిమానాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. మోదీ ఆ ఫీట్ సాధించి గ్లోబల్ లీడర్ అయ్యారని అనుకోవచ్చు. అయితే మోదీ కంటే ఆకర్షణీయమైన నేతలు … చాలా మంది ఉన్నారని.. మోదీకే ఇంతా ఫాలోయింగ్ రావడం వెనుక బాట్స్ ఉన్నాయని అనే వాళ్లు కూడా ఉన్నారు.
అమెరికాలో వంద మిలియన్ల కుపైగా ఎక్స్ యూజర్లు ఉన్నారు. హాలీవుడ్ స్టార్లను ఫాలో చేస్తారు కాబట్టి సహజంగానే ఫాలోయింగ్ పెరుగుతుంది. అమెరికా తర్వాత ట్విట్టర్ ను ఉపయోగించే దేశాల్లో నెక్ట్స్ జపాన్ ఉంటుంది. అక్కడి నుంచి మోదీకి సపోర్టు ఉండదు. చైనాలో ట్విట్టర్ లేదు. అంటేద దాదాపుగా ఇండియాతో పాటు ఇతర దేశాల్లోనూ మోదీ .. క్రేజ్ తెచ్చుకుని ఎక్స్ లో చాంపియన అయ్యారన్నమాట.