ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారణాశి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఏడేళ్ల కాలంలో వారణాశిలో ఏమీ అభివృద్ధి జరగలేదని చాలా చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆయన చేసిన అభివృద్ధిని దేశం మొత్తం చూపించడానికి బీజేపీ రెడీ అయింది. దానికి సోమవారమే ముహుర్తం. దివ్య కాశి – భవ్య కాశి పేరుతో దేశం మొత్తం చూపించడానికి ఏర్పాట్లు చేసేశారు. ఇంతకీ ప్రధాని మోడీ వారణాశికి చేసిన అభివృద్ధి ఏమిటంటే కాశీలో కొన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం.
మోడీ ప్రధాని అయ్యాక దివ్య కాశి – భవ్య కాశి పేరుకో కాశీని అభివృద్ధి చేయాలనుకున్నారు. అందులో భాగంగా కాశీ విశ్వనాథ్ కారిడార్ ను ఇప్పటికి పూర్తి చేశారు. యాత్రికుల కోసం యాత్రి సువిధ కేంద్రాలు, టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, వేద కేంద్రం, ముముక్షు భవన్, సిటీ మ్యూజియం , వ్యూయింగ్ గ్యాలరీ, ఫుడ్ కోర్ట్ ఇలాంటివన్నమాట. వీటితో పాటు నమామి గంగా పేరుతో గంగా ప్రక్షాళన కూడా ఎప్పుడో ప్రారంభించారు. కానీ కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా అక్కడ ఇంకా పొల్యూషన్ పెరిగింది కానీ తగ్గలేదన్న నివేదికలు వచ్చాయి. ప్రారంభోత్సవాల అనంతరం కొత్తగా తెచ్చిన నది క్రూయిజ్లో పలువురు ముఖ్యమంత్రులతో మోడీ పిచ్చాపాటిగా మాట్లాడతారు.
కాశీ ఆలయం దేశవ్యాప్తంగాప్రసిద్ది చెందింది. హిందువులు ఒక్క సారైనా అక్కడికి వెళ్లి రావాలని అనుకుంటారు. అందుకే దీన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడానికి బీజీపీ పక్కా ఏర్పాట్లు చేసింది. దూరదర్శన్ 200పైగా సిబ్బందిని నియమించింది. అన్ని చానళ్లు అవుట్ పుట్నుక్షణం మిస్ కాకుండా ఇస్తాయి. అంతేనా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఆలయాల దగ్గర భారీ స్క్రీన్లు పెట్టి.. భక్తులందరూ రావాలని.. పిలుస్తున్నారు. ఏపీ , తెలంగాణలోనూ ఈ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు.
యూపీ ఎన్నికల కారణంగా ప్రధానమంత్రి స్థాయి అభివృద్ది కాకపోయినా.. అతి పెద్దగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాశీని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని దేశమంతా చాటాలనుకుంటున్నారు.