నరేష్-రమ్య రఘుపతి వివాదంలో మరో మలుపు చోటు చేసుకుంది. రమ్యతో తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిషన్ వేశారు నరేష్. కర్నాటక రౌడీ రాకేష్‌శెట్టితో రెక్కీ చేయించిందని, కృష్ణ మరణించిన సమయంలో ఈ రెక్కీ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో తన ఫోన్ హ్యాక్ చేసిందని నరేష్ ఆరోపించారు.
నరేశ్, పవిత్రా లోకేశ్ పెళ్లి కి సిద్దమైన సంగతి తెలిసిందే. అయితే వాళ్ల పెళ్లిని జరగనివ్వనని, నరేశ్ తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదని.. ఆ కేసు కోర్టులోనే ఉందని రమ్య వాదన. ‘’ఎంతకష్టమైనా నేను పోరాటం చేస్తా. నరేశ్‌తో కలిసి ఉండటానికి ప్రయత్నిస్తా. మా విడాకుల కేసు కోర్టులో నడుస్తూనే ఉంది. నేను అయితే విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా లేను’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వివాదంలో నరేష్ తనకు ప్రాణహాని వుందని కోర్టుని ఆశ్రయించడం మళ్ళీ వార్తల్లో నిలిచింది.