” ఈరోజు నిఝంగా.. గొప్ప రోజు. మీరందరూ ఫ్ఫ్యా..న్ గుర్తుకే ఓటు వేయాలి. భీమ వరంలో గ్రంధి సీ..ను గారిని గెలిపించాల్సిన భా..ధ్య..త మనందరి మీదా ఉంది. చాలా మంది సినిమా హీరోలు నా క్లాష్మేట్స్, వారందరితో రెండు మూడు రోజులకు ఒకసారి మాట్లాడుతూనే ఉంటాను. వారందరి అభిమానులు కూడా ఝగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి ” అంటూ వైకాపా నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు పూటుగా తాగి స్టేజ్ పైన తూగుతూ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు రాష్ట్రం మొత్తం వైరల్ అవుతుంది.
ఇటుపక్క వైఎస్సార్సీపీ అధినేత జగన్ దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని వాగ్దానాలు చేస్తుంటే, ఆ పార్టీలో ఎంపీ అభ్యర్థులు, నాయకులు మాత్రం ఫుల్లుగా మందేసి స్పీచులు దంచేస్తున్నారు. బహుశా మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటే మద్యపానం సేవించి స్పీచ్ లు ఇవ్వాలి ఏమో అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.
టీవీ9 ఇంటర్వ్యూలో మొన్నీమధ్య ” మీరు 6 వేల కోట్లు బ్యాంకులకు ఎగ వేశారట కదా” అని యాంకర్ అడిగితే, అబ్బే అంత కాదు, కేవలం 300 కోట్లు మాత్రమే డిఫాల్ట్ అయ్యానంటూ రఘురామకృష్ణంరాజు సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. మరి బ్యాంకుల నుండి డిఫాల్ట్ అయిన ఇలాంటివారు పార్లమెంటుకు వెళితే ప్రజాసేవ ఏమాత్రం చేస్తారు అన్నది తెలిసిందే. ఇప్పుడు ఇంతగా మద్యం సేవించి జనాల మధ్యకు వచ్చి స్పీచ్ ఇస్తున్నాడంటే ఈయన ప్రజలను ఎంతగా “టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్” గా తీసుకున్నారు అనేది అర్థమవుతోంది.
ఈ లెక్కన, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ ప్రధానంగా జనసేన అభ్యర్థి నాగబాబు కు టిడిపి అభ్యర్థి శివరామరాజు కు ఉండే అవకాశం కనిపిస్తోంది.
A video talks for itself.
FYI…Liquor ban is one of the key poll promises of @YSRCParty
cc @PrashantKishor @IndianPAC pic.twitter.com/2KFigwGwCd
— Telugu360 (@Telugu360) March 30, 2019