ఇటీవల ప్రకటించిన జాతీయ ఉత్తమ చిత్రాల్లో మలయాళ ఫీచర్ ఫిల్మ్ ఆట్టం ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆట్టం అంటే నాటకం. ఆ కథ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు… చుట్టుపక్కల వ్యక్తుల వ్యక్తిత్వాల్ని సునిశిత దృష్టితో చూసింది. ఓ నాటకం గ్రూపులో ఒక్కరే మహిళా నటి. మిగతా అంతా పురుషులు. ఓ పార్టీ చేసుకున్న రోజు ఆ మహిళా నటితో ఒకరు అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఆ నటి ఒకర్ని అనుమానిస్తారు. కానీ కన్ఫర్మ్ గా తెలియదు. ఈ క్రమంలో ఆ టీములో మగవాళ్లు అందరూ వ్యవహరించే తీరును కథగా మలిచారు. చివరికి అందరూ ఒకటేనని.. తనతో అసభ్యంగా ప్రవర్తిచింది ఎవరో తెలుసుకోవాలని లేదని హీరోయిన్ చెబుతుది. అదే క్లైమాక్స్.
ఈ సినిమా చూసిన వారికి ఇప్పుడు మలయాళ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు చూసిన వారికి సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఎందుకంటే…దశాబ్దల కిందట.. తమకు వేధింపులు ఎదురయ్యాయని ఇప్పుడు చాలా మంది బయటకు వస్తున్నారు. వారంతా అప్పట్లో తమ యూనిట్ వాళ్లకు.. హీరోలకు దర్శకులకు చెప్పారు. అప్పుడు వారి వ్యవహరించిన విధానంపై కూడా చర్చ జరుగుతోంది. ఈ కారణంగానే నటీనటుల సంఘం కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం ఓ రకంగా సినీ పరిశ్రమలో చిచ్చు పెట్టేసింది.
నిజానికి దేశంలో అత్యంత సునిశితమైన ఆలోచనలతో.. కథలను సినిమాలు తీసేది మలయాళ పరిశ్రమ. ఓటీటీ వచ్చిన తర్వాత మలయాళ పరిశ్రమ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. సెన్సిబుల్ సినిమాల ఇండస్ట్రీగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు జరుగుతున్న వివాదం మాత్రం.. ఆ ఇండస్ట్రీ ఇమేజ్ ను దెబ్బతీసేదే. ప్రతి ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఘటనలు ఉంటాయి..కానీ సినీ పరిశ్రమపైనే ఎక్కువ ప్రచారం జరుగుతోంది. హేమ కమిటీ రిపోర్టు వల్ల… మలయాళ సినీ పరిశ్రమపై ఇంకా ఎక్కువ మరక పడుతోంది.