భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ఒలింపిక్స్ లో సత్తా చాటాడు. పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్ లో రజతాన్ని కైవసం చేసుకొని …ఒలింపిక్ అథ్లెటిక్స్ లో భారత్ కు వరుసగా రెండు పతకాలు అందించి చరిత్రకెక్కాడు.
జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా సీజన్ బెస్ట్ త్రో విసరగా.. అనూహ్య రీతిలో పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్ సత్తా చాటడంతో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. ఒలింపిక్ రికార్డ్ 90.57మీటర్లు కాగా.. 92.97 దూరం విసిరి కొత్త రికార్డు నెలకొల్పాడు. దీంతో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
రెండో స్థానంలో నిలిచినప్పటికీ నీరజ్ కొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. స్వాతంత్ర్య అనంతరం రెండు పతకాలు సాధించిన మొదటి ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ గా చరిత్ర సృష్టించాడు.
ఇక, ఒలింపిక్స్ లో రక్తం సాధించిన నీరజ్ ను ప్రధాని మోడీ అభినందించారు. మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడని, అతనొక అద్భుతమైన అథ్లెట్ అని ప్రశంసించారు. ఒలంపిక్స్ లో నీరజ్ ప్రదర్శన పట్ల భారత్ హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు.