వైసీపీ ఎమ్మెల్యేల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీరు భిన్నంగా ఉంది. ఆయన నేరుగా తమ పార్టీ ప్రభుత్వంపై ఎటాక్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు అది మరింత పెంచారు. తాజాగా ఏపీలోపెన్షన్ల తీసివేతపై గగ్గోలు రేగుతోంది. ప్రతీ నియోజకవర్గాలంలో ఆరేడు వేల మంది పెన్షన్లు రకరకాల కారణాలతో తీసేశారు. దీంతో బాధితులంతా.. అధికార పార్టీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్తున్నారు. చాలా మంది తప్పించుకుంటున్నారు. కానీ కోటంరెడ్డి మాత్రం వారికి అండగా నిలబడడుతున్నారు. ఒక్కరికి పెన్షన్ తీసేసినా ఉరుకునేది లేదని పరోక్షంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
అదే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. కానీ హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోవడం… పనులు చేయకపోవడంపైనా మండిపడ్డారు. ఆర్థిక శాఖ కార్యదర్శిపై ఘాటు విమర్శలు చేశారు. అంటే నేరుగా ప్రభుత్వాన్ని విమర్శించినట్లే. కారణం ఏదైనా కానీ.. కోటంరెడ్డి .. రెబల్ గా మారుతున్నారు. వైసీపీ అధినేత ఇటీవల వ్యక్తం చేస్తున్న అసహన జాబితా ఎమ్మెల్యేల్లో కోటంరెడ్డి లేరు. ఆయన పరిస్థితి బాగుందని వైసీపీలోనే చెప్పుకుంటున్నారు.
కానీ కోటంరెడ్డి మాత్రం హైకమాండ్ పై కాలు దువ్వుతున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి వచ్చినప్పటి నుండి ఆయన కంఫర్ట్ గా లేరు. అదే సమయంలో ప్రభుత్వం మారితే పడే ఇబ్బందులేమిటో ఆయనకు కళ్ల ముందు కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కోటంరెడ్డి చేసిన అరాచకం ఓ రేంజ్ లో ఉంది.కానీ వాటిపై కేసులు పెట్టలేదు. ప్రభుత్వం మారితే అవన్నీ మెడకు చుట్టుకుంటాయన్న భయం ఆయనలో ఉందంటున్నారు.