తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ మంగళవారం జరగనుంది. రెండు నెలలుగా ఉగ్గబట్టుకున్న సీనియర్ ఎమ్మెల్యేలు.. ఇప్పుడు పదవి వస్తుందో రాదోనన్న టెన్షన్‌కు గురవుతున్నారు. ప్రగతి భవన్ నుంచి ఇప్పటి వరకూ..ఎవరికీ సమాచారం అందలేదు. అయితే.. మీడియా వర్గాలకు మాత్రం.. చాలా క్లారిటీతో..కూడిన జాబితా మాత్రం అందింది. ఇదే కచ్చితం అని నిర్ధారిచకపోయినా… అంతిమగా ఇదే జాబితా. మహా అయితే.. ఒకరిద్దరు మార్పు, చేర్పులు ఉండవచ్చని భావిస్తున్నారు. ముగ్గురు, నలుగురు తప్ప.. అంతా గత మంత్రివర్గంలో లేని వాళ్లే ఉంటారు. పరిమితమైన మంత్రివర్గం అని కేసీఆర్.. ముందు నుంచీ చెబుతున్నారు కాబట్టి.. ఆ ప్రకారం.. ఎనిమిది లేదా తొమ్మిది మంది మంత్రులకు మాత్రమే అవకాశం లభించబోతోంది.
ఉమ్మడి జిల్లాల వారీగా.. చూస్తే.. హైదరాబాద్ – తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆదిలాబాద్ – ఇంద్రకరణ్‌రెడ్డి, కరీంనగర్ – కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ , వరంగల్ – ఎర్రబెల్లి దయాకర్ రావు, నల్గొండ – జగదీష్‌రెడ్డి, నిజామాబాద్ – ప్రశాంత్‌రెడ్డి, మహబూబ్‌నగర్ – నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ లకు చోటు ఖరారయిందని చెబుతున్నారు. ఈ కెబినెట్ ప్రధానంగా లోక్‌సభ ఎన్నికలను టార్గెట్ చేసి ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో చోటు దక్కని సీనియర్లకు లోక్‌సభ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తారు. శాఖల కేటాయింపుపైనా కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. జాబితా చూస్తే.. పార్టీలో మొదటి నుంచి ఉన్న సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేయడం ఖాయమే. వీరికి సర్దిచెప్పడానికి ప్రస్తుతం కేసీఆర్ సమయం కేటాయిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోడం ఖాయంగా కనిపిస్తోంది.
హరీష్, కేటీఆర్‌లకు.. ఈ సారి మంత్రి వర్గంలో చోటు కల్పించకపోవడంపై… భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కేటీఆర్‌ను.. పార్టీపైప పెంచుకోవాలని… కేసీఆర్ సూచించినట్లు చెబుతున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఇప్పుడు పూర్తి సమయం పార్టీకే వెచ్చిస్తున్నారు. హరీష్‌రావుకు అవకాశం ఇవ్వకపోవడంపై.. అనేక ఊహాగానాలు వస్తున్నాయి. అయితే.. హరీష్‌ను జాతీయ రాజకీయాలకు పంపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. మంచి వ్యూహకర్త అయిన హరీష్ రావుకు… ఉత్తరతెలంగాణలో కీలకమైన లోక్‌సభ స్థానాలకు ఇన్చార్జ్గా పెట్టే ఆలోచన చేస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల ఫలితాలను బట్టి… ఆ తర్వాత ఈ కేబినెట్లోనూ మార్పు చేర్పులు ఉండబోతున్నాయి. టీఆర్ఎస్ పాత్ర కీలకం అయితే… ముఖ్య స్థానాల్లో మార్పులు ఖాయమే..!