ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు కట్టినందుకు రూ. 120 కోట్ల జరిమానా విధించింది. పురుషోత్తమ పట్నంకు రూ. 24.56 కోట్లు, పట్టిసీమ ప్రాజెక్టుకు 24.90 కోట్లు, చింతలపూడి ప్రాజెక్టుకు రూ. 73.6 కోట్లు జరిగిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని మూడు నెలల్లోగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి చెల్లించాలని ఎన్టీటీ ఆదేశించింది. వీటిని ఎలా వినియోగించాలో ఏపీ పీసీబీ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని ఎన్టీటీ ఆదేశించింది.
నిజానికి ఈ మూడుపోలవరంలోభాగమని ఏపీ చెబుతోంది. పోలవరం పూర్తవడానికి ముందే నీటిని పోలవరం కాలువల ద్వారా పంపించడానికి నిర్మించిన ప్రాజెక్టులు. అయితే వీటికి పర్యావరణ అనుమతులు తీసుకోలేదని ఎన్జీటీలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కేంద్రం ఇవి పోలవరం భాగం కాదని చెప్పింది. పురుషోత్తమ పట్నం ఒక్కటే నిర్మాణంలో ఉంది. పట్టిసీమ,చింతలపూడి ప్రాజెక్టులు పూర్తయ్యాయి. పర్యావరణ అనుమతులు లేకుండా కట్టినందుకు జరిమానా విధించింది.
నిజానికి ఏపీ సర్కార్ ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ఇవన్నీ గత ప్రభుత్వం కట్టినవే. అయితే అప్పుడు ప్రభుత్వం పోలవరంలో భాగం అనిగట్టిగా వాదిస్తూ వచ్చింది. అప్పుడెవరూ పట్టించుకోలేదు.ఈ ప్రభుత్వంలో సరైన వాదనలు వినిపించకపోవడంతో జరిమానాకు గురి కావాల్సి వచ్చింది.