పాపం నిహారిక… ఏదీ కలసి రావడం లేదు. మెగా డాటర్ అనే ట్యాగ్ లైన్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. హిట్టు కోసం పరితపిస్తూ.. తపిస్తూ.. ‘సూర్యకాంతం’ అనే సినిమా తీసింది. శుక్రవారం విడుదలైన ఈసినిమాతో నిహారిక పరాజయాల హ్యాట్రిక్ పరిపూర్ణమైనట్టే. వెబ్ సిరీస్‌కి సరిపడ కథని, సినిమాగా వండేస్తే ఎలా ఉంటుందో చెప్పడానికి ‘సూర్యకాంతం’ అత్యుత్తమ ఉదాహరణగా నిలిచింది. ఈ కథ, కథనాలు సినిమాకి సరితూగలేక.. బాక్సాఫీసు దగ్గర బోల్తా పడింది. నిజానికి ఈ కథని వెబ్ సిరీస్‌గా తీసుకున్నా బాగుండేదేమో.
సినిమాకి ఆదరణ దక్కకపోవడం అటుంచితే.. నటిగా నిహారిక కూడా ఈ సినిమాతో చేసిందేం లేదు. అప్పుడప్పుడూ ఓవర్ యాక్టింగ్‌తో బాగా ఇబ్బంది పడింది. తను కూడా… వెబ్ సిరీస్ మూడ్ నుంచి బయటకు రావడం లేదేమో అనిపిస్తోంది. ‘నేను హీరోయిన్ మెటీరియల్ కాదు’ అనేది నిహారిక తరచూ చెప్పే మాట. అది నిజమే. కాకపోతే…. తన శైలికి తగినట్టుగా కథల్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. హుషారైన నటన అంటే ఓవర్ యాక్టింగ్ చేయడం కాదని నిహారిక గ్రహించాలి. తొలి రెండు సినిమాలూ ఫ్లాప్ అయినా.. నిహారికకు మైనస్ మార్కులేం పడలేదు. ఆ లోటు.. సూర్యకాంతం తీర్చేట్టు ఉంది. ఇకనైనా యాక్టింగ్ మీటర్‌ని నిహారిక దృష్టిలో పెట్టుకుంటే మంచిదేమో..?