సరికొత్త కథలతో సందడి చేసే యువ కథానాయకుడు నిఖిల్. వరుస విజయాలతో మినిమం గ్యారెంటీ హీరో అనిపించుకొన్నాడు. కేశవ తరవాత ఇప్పుడు మరో ప్రాజెక్టుపై దృష్టి పెట్టాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే ఈ చిత్రానికి శరన్ కొప్పిశెట్టి దర్శకుడు. ఈ చిత్రంలోని నిఖిల్ రెండు పార్శ్వాలున్న పాత్రలో కనిపించనున్నాడు. గెటప్‌లు కూడా రెండే. కేశవలో గడ్డంతో రఫ్‌గా కనిపించిన నిఖిల్… దాదాపుగా అదే లుక్ ఈ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నాడు. మరో లుక్ కోసం క్లీన్ షేవ్‌తో బాలీవుడ్ హీరోలా మారిపోయాడు. ఈ లుక్ ఇప్పుడు బయటకు వచ్చింది కూడా. క్లీన్ షేవ్ కొత్త కాకపోయినా నిఖిల్‌కి మాత్రం బాగా సూటైంది. నిఖిల్‌తో పనిచేసి, హిట్లు అందించిన దర్శకులు సుధీర్ వర్మ, చందూ మొండేటి ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తుండడం విశేషం. అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కథానాయికలు, ఇతర ముఖ్య పాత్రల కోసం అడిషన్స్ చేసి కొత్త వారిని ఎంచుకొన్నారు. టైటిల్ త్వరలోనే ప్రకటిస్తారు.