కమల్ హాసన్ కెరీర్ లో మరో మైల్ స్టోన్ గా నిలిచిపొయింది విక్రమ్. పాన్ ఇండియా ప్రభంజనం సృష్టించింది. ఈ సినిమాని తెలుగు లో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై హీరో నితిన్ ,సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. మంచి లాభాలు వచ్చాయి. ఈ సినిమా కొనమని తండ్రి సుధాకర్ రెడ్డికి సలహా ఇచ్చింది నితిన్ నే. మాచర్ల నియోజక వర్గం ప్రమోషన్స్ లో విక్రమ్ గురించ తన మనసులో మాట చెప్పాడు నితిన్.
”విక్రమ్ చూసిన వారం రోజులు నిద్రపట్టలేదు. సినిమా అంటే ఇలా వుండాలి కదా., ఇలా తీయాలి కదా అనిపించింది. ఒకే మూసలో వుండే ఫార్మాలా కాకుండా కథని బలంగా నమ్మి చేస్తే విక్రమ్ లాంటి సినిమాలు వస్తాయి. భవిష్యత్ లో ఆలాంటి బలమైన కథలు వస్తే తప్పకుండా చేస్తా” అని చెప్పుకొచ్చాడు.
ఇదే సందర్భంలో ప్రేక్షకులు థియేటర్ కి రాకపోవడానికి గల కారణంపై కూడా తన అభిప్రాయం పంచుకున్నాడు. ”కోవిడ్ తర్వాత ప్రేక్షకుల మూడ్ స్వింగ్ ఏమిటో అర్ధం కావడం లేదు. ఏ సినిమా చూస్తున్నారు.. ? ఏ సినిమాకి వస్తున్నారో సరిగ్గా అర్ధం కావడం లేదు. టీజర్, ట్రైలర్ లో ఏదో నచ్చి వస్తున్నారు. సినిమా నచ్చితే అది నడుస్తుంది. అయితే ఏ సినిమా నడుస్తుందనేది ఊహించలేం” అని అభిప్రాయపడ్డాడు.