టాలీవుడ్‌లోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో నితిన్ ఒకడు. చాలా కాలం నుంచి ‘ఈ యేడాదే పెళ్లి చేసుకుంటా..’ అంటూ ఊరిస్తున్నాడు. అయితే ఈ మాటని ఈ యేడాది మాత్రం నిజం చేసేసుకుంటున్నాడు. నితిన్ పెళ్లి కుదిరింది. ఈ ఏప్రిల్ 16న నితిన్ పెళ్లి చేసుకుంటున్నాడు. తనది ప్రేమ పెళ్లి. లండన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్ చదివిన షాలినితో కొంతకాలంగా ప్రేమలో ఉన్నాడు నితిన్. ఈ ప్రేమ పెద్దలకు తెలిసి, వాళ్లూ ఒప్పుకున్నాక – ఈ జంట పెళ్లి పీటలెక్కబోతోంది. నితిన్ నటించిన ‘భీష్మ’ ఈనెల 21న విడుదల అవుతోంది. మరోవైపు `రంగ్ దే` షూటింగ్లో బిజీగా ఉన్నాడు నితిన్. పెళ్లి కోసమని.. ‘రంగ్ దే’ షూటింగ్ పనులు చక చక పూర్తి చేస్తున్నాడు నితిన్. మార్చి నెలాఖరుకి `రంగ్ దే` పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఇక పెళ్లిళ్ల జాబితాలో ముందుగా కనిపించే పేర్లు ప్రభాస్, రానాలవి. వాళ్లెప్పుడు పెళ్లి కబురు చెబుతారో చూడాలి.