ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ నియంత్రణ వ్యవస్థ… ఎంత దారుణంగా ఉందో కరెంట్ కోతలే నిరూపిస్తున్నాయి. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ మరోసారి లెక్కల ద్వారా చెప్పింది.స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లో ఆంధ్రప్రదేశ్‌కు ఓవరాల్‌గా 18వ స్థానలో నిలబడింది. రాష్ట్రాల్లో ఈ స్థానం పన్నెండోది. నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ ఈ నివేదిక విడుదల చేశారు. 20 పెద్ద రాష్ట్రాల విభాగంలో పెద్ద రాష్ట్రాల్లో గుజరాత్ , కేరళ , పంజాబ్ అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఎపికి మూడు సూచిల్లో సున్నా, ఐదు సూచిల్లో పది కంటే తక్కువ స్కోరు వచ్చాయి. కొత్త విధానాల కల్పనలో పూర్తిగా జీరో ఫలితాలు వచ్చాయి.
విద్యుత్ వాహనాలు, ఛార్జిరగ్ సౌకర్యాల కల్పన, వినియోగదారులకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటులో నిల్‌గా నివేదిక చూపిరచిరది. ఇక డిస్కమ్‌ల పనితీరుకు సంబంధిరచి రుణ విభాగం, నేరుగా నగదు బదిలీ విభాగాల్లో జీరో స్కోర్ సాధించింది. ఎపి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో మాత్రం కేవలం 5.6 స్కోర్‌కే పరిమితమైంది. రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్‌ను తొమ్మిది గంటలపాటు అరదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు కానీ అది అవాస్తవమని ఈ లెక్కలు చెబుతున్నాయి.
కొసమెురుపేమింటే… ఏపీకి కాస్తోకూస్తో మార్కులు వచ్చాయంటే దానికి కారణం విద్యుత్ చార్జీలు. వినియోగదారులకు విద్యుత్ ఛార్జీల అమలులో మాత్రం వంద శాతం మార్కులు పడ్డాయి. అంటే మిగతా ఏ వ్యవస్థలోనూ పరిస్థితి బాగోలేకపోయినా చార్జీలను మాత్రం ముక్కు పిండి వసూలు చేయడంలో ఏపీ విద్యుత్ సంస్థలు ముందున్నాయన్నమాట.