మోహన్ బాబు యూనివర్శిటీలో మొదటి స్నాతకోత్సవ వేడుకల్ని ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను పిలుచుకొచ్చారు. అందు కోసం కూడా మోహన్ బాబు చాలా కష్టపడాల్సి వచ్చిందని… ఓ టీవీ చానల్ పెద్దతో చెప్పించుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. నిజానికి మోహన్ బాబు తన విద్యానికేతన్ మొత్తాన్ని ఎంబీయూగా మార్చేశారు.
ఎంబీయూను టాప్ లెవల్ వర్శిటీగా ప్రచారం చేసుకోవాలనుకుటున్నారు. అందుకే ఇటీవల ఓ శాటిలైట్ లాంఛ్ అని హడావుడి చేశారు. ఎయిర్ బెలూన్ గాల్లోకి వదిలారు. ఇప్పుడు మొదటి స్నాతకోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించాలనుకున్నారు. కానీ ఏపీ నుంచి పాలక పార్టీకి చెందిన వారెవరూ వచ్చేందుకు సిద్ధంగా లేరు. పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించేందుకు ఆయన కూడా సిగ్గుపడి ఉంటారు. చంద్రబాబు వెళ్లే చాన్స్ లేదు. అందుకే తెలంగాణ డిప్యూటీ సీఎంతో సరి పెట్టుకున్నారని అంటున్నారు.
మరీ తీసికట్టుగా ఉండకుండా.. డిప్యూటీ సీఎం రేంజ్ లో అయినా లీడర్ తన యూనివర్శిటీకి వచ్చినందుకు మోహన్ బాబు సంతోషపడ్డారు. భట్టి విక్రమార్కను వైఎస్ తో పోల్చి సంతృప్తి పడ్డారు.