సోమవారం సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించబోయే సమీక్షా సమావేశంలో అంతా తేలిపోతుందని ఆ పార్టీలోనే చర్చ జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా రూట్ మార్చేశారు వైసీపీ పెద్దలు. హడావుడిగా పేర్ని నానిని పిలిపించి… కొన్ని మాటలు మీడియాకు చెప్పించారు. అసలు మీడియాలో జరుగుతున్నట్లుగా సోమవారం ఏ చర్చా ఉండదని… కేవలం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష మాత్రమే జరుగుతుందని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఇంకా ఏ ఇతర అంశాలు చర్చించరని. .. సీఎం జగన్ ఎవరికీ ఎలాంటి హెచ్చరికలు జారీ చేయరన్నట్లుగా పేర్ని నాని వివరించడం వైసీపీలోనే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది.
ఇంకా విచిత్రం ఏమిటంటే… మంత్రి వర్గంలో మార్పు జరిగే ప్రసక్తే లేదని పేర్ని నాని చెబుతున్నరు. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ తోనే ఎన్నికలు జరుగుతాయని తేల్చేశారు. అంత కన్ఫర్మ్ గా పేర్ని నాని చెప్పారంటే… ఖచ్చితంగా హైకమాండ్ నుంచి సూచనలు వచ్చే ఉంటాయని .. లేకపోతే మంత్రివర్గ విస్తరణ మీద తీసేసిన మంత్రి మాట్లాడే అవకాశం ఉండందున్నారు. పైగా పేర్ని నాని ఈ క్యాబినెట్ తోనే ఎన్నికలకు వెళ్తున్నామని గెలుస్తున్నామని కూడా చాలెంజ్ చేసేశారు. .మీడియా, సోషల్ మీడియాలో రేటింగ్, వ్యూస్ కోసమే మంత్రివర్గంలో మార్పు అనే వార్తలు వస్తున్నాయని కవర్ చేసుకున్నారు.
అదే సమయంలో సీఎం జగన్ కొంత మంది మంత్రులపై సీరియస్ అయ్యారని వస్తున్న వార్తలను ధృవీకరించినట్లుగా మాట్లాడారు. పార్టీ ఇచ్చిన పని సక్రమంగా నిర్వర్తించకపోతే జగన్ కోప్పడకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. దానర్థం మంత్రులను తొలగించడం కాదని అంటున్నారు. మొత్తంగా ఇప్పుడు మంత్రుల్ని తొలగిస్తే.. అసంతృప్తి సునామీతో మొత్తం వ్యవహారం తేడాగా మారిపోయే ప్రమాదం ఉండటంతో వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు.